Provident Fund: Good news for government employees ... PF rules to change from July
Provident Fund : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ... జులై నుంచి మారనున్న PF రూల్స్.
Provident Fund: ప్రావిడెంట్ ఫండ్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఓ ప్రకటన చేసింది. దాని ప్రకారం... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జూన్ 2021 వరకూ కరవు బత్యం (Dearness Allowance - DA) ఎప్పటికప్పుడు టైమ్ ప్రకారమే పొందుతారుగానీ... ఆ విషయం వారి శాలరీలో కనిపించదు. అది జూన్ 2021 నుంచి మాత్రమే కనిపిస్తుంది. జనవరి నుంచి జూన్ 2021 వరకూ... మూడు రకాల డీఏ లను ఉద్యోగులు తిరిగి పొందుతారు. వాటిని CGS శాలరీకి కలుపుతారు. ఫలితంగా నెలవారీ పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరుగుతుంది. ఇంకోలా చెప్పాలంటే... దీర్ఘకాలంలో పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
ఆల్ ఇండియా కన్య్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) ప్రకారం... జనవరి నుంచి జూన్ 2021 వరకూ కేంద్రం డీఏను 4 శాతం పెంచనుంది.
అలాగే... జనవరి నుంచి జూన్ 2020 వరకూ... 3 శాతం, జులై నుంచి డిసెంబర్ 2020 వరకూ... 3 శాతం డీఏను ఇస్తుందని భావించవచ్చు. అంటే మొత్తం 11 శాతం డీఏ లభిస్తుంది. ఈ డీఏను చెప్పినట్లుగానే ఇస్తే... అది ఇప్పడున్న 17 శాతం నుంచి 28 శాతానికి పెరుగుతుంది.
డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచడం అంటే... పీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను పెంచినట్లే. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారీ జీతంలో మార్పులు తెస్తుంది.
ప్రస్తుతం 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 58 లక్షల మంది రిటైర్డ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పింఛనుదారులు... కరవు ఉపశమనం (Dearness Relief - DR) పొందుతారు. ఎందుకంటే కేంద్రం DA, DRను జూన్ 2021 వరకూ నిలిపివేసింది. ఈ క్రమంలో జులై నుంచి రూల్స్ మారే ఛాన్స్ ఉంది.

0 Response to "Provident Fund: Good news for government employees ... PF rules to change from July"
Post a Comment