Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Shocking news .. Corona spread through the air .. Sensational things that came out in the studies ..

 షాకింగ్ న్యూస్.. గాలి ద్వారానే కరోనా వ్యాప్తి.. అధ్యాయనాల్లో బయటపడ్డ సంచలన విషయాలు..

Shocking news .. Corona spread through the air .. Sensational things that came out in the studies ..

Corona Virus: దేశంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న వేళ.. తాజాగా జరిగిన ఓ అధ్యాయనంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కరోనాకి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్ ప్రధానంగా గాలి ద్వారానే వ్యాపిస్తుందని తేలింది. వైరస్ గాలిలో ఎక్కువగా వ్యాప్తి చెందడమే కాకుండా.. ప్రజలకు చాలా తొందరగా వ్యాప్తి చెందుతుందని తెలీంది. యూకే, యూఎస్ఏ, కెనడాకు చెందిన ఆరుగులు నిపుణుల అభిప్రాయం ప్రకారం సహకార ఇన్‏స్టీట్యూట్ ఫర్ రీసెర్చ్‏లో రసాయన శాస్త్రవేత్త జోల్ లూయిల్ జిమెనెజ్ ఎన్విరాన్ మెంట్ సైన్సెస్ (CIRES) , కొలరాడో బౌల్డర్ విశ్వావిద్యాలయం జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెలువడ్డాయి.

గాలిలో వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధానంగా పది రకాల కారణాలున్నాయని నిపుణులు సూచించారు.

స్కగిట్ కోయిర్ వ్యాప్తి వంటి సూపర్ స్పైడర్ వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో ఒకే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి దాదాపు 53 మంది వ్యాధి భారిన పడే అవకాశం ఉంది. ఇందుకు కారణం దగ్గరి పరిచయాలు లేదా భాగస్వామాలు, వస్తువులను తాకడం ద్వారా కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని అధ్యయనంలో తెలీంది. అంతేకాకుండా.. SARS-Cov -2 ప్రసార రేట్లు ఆరు బయట కంటే ఇంటి లోపల చాలా ఎక్కువ. ఇండోర్ వెంటిలేషన్ ద్వారా గాలి తక్కువగా ఉంటుంది. ఇందులో కనీసం 40 శాతం మందికి దగ్గు లేదా తుమ్ము లేని వ్యక్తుల నుంచి SARS-CoV-2 అసింప్టోమాటిక్ లేదా ప్రిసింప్టోమాటిక్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా వైరస్ గాలిలో వ్యాప్తి చెందెందుకు మద్దతుగా ఉంటుంది. హోటళ్లలో పక్కనే ఉన్న గదుల్లో వ్యక్తు ల మధ్య వైరస్ వ్యాప్తి చెందుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ద్రావాల యొక్క డైనమిక్స్, లైవ్ వైరస్ లను వేరుచేయడం చాలా కష్టమని రచయిత గ్రీన్హాల్గ్ చెప్పారు. కరోనా వైరస్ నియంత్రించడానికి రోగ నిరోధక పెంపొందించుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే చేతులను కడగడం… బాహ్యాంగా శుభ్రపరచుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ సోకిన వ్యక్తి గాలి పీల్చుకున్నప్పుడు, మాట్లాడేప్పుడు, అరవడం లేదా తుమ్ముతున్నప్పుడు ఉత్పత్తి 

అయ్యే ఏరోసోల్లను పీల్చుకోవడం వలన ఈ వ్యాధిభారిన పడతారు. ఇంట్లో ఉన్నప్పుడు 6 అడుగులు లేదా 2 మీటర్ల కంటే తక్కువ దూరం ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తికి గాలి ప్రధాన మార్గం అనేది ఇంకా ప్రశ్నించడం చాలా ఆశ్చర్యమే అని సహరచయిత ప్రొఫెసర్ కింర్లీ ప్రథర్ అన్నారు. కాలిఫోర్నియా శాన్ డియాగో విశ్వవిద్యాలయం నుంచి ఏరోసోల్ శ్రాస్తవేత్త ఏరోసోల్స్ ను పీల్చుకోవడం వలన కరోనా వ్యాప్తి సోకుతుంది. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కరోనా నియంత్రణ చర్యలు జాగ్రత్తగా పాటించాలని సూచిస్తున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Shocking news .. Corona spread through the air .. Sensational things that came out in the studies .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0