Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

What are the real reasons for the losses of banks

 బ్యాంకుల నష్టాలకు అసలు కారణాలేమిటి

What are the real reasons for the losses of banks

ప్రభుత్వరంగ బ్యాంకులకు వ్యతిరేకంగా ఒక పథకం ప్రకారం ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వరంగ బ్యాంకులను అసమర్థమైనవిగా చూపించే ప్రయత్నం పనిగట్టుకొని చేస్తున్నదే

ప్రస్తుత ప్రభుత్వ కాలం 2015 నుండి గత ఆరేళ్ల కాలంలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.తొమ్మిది లక్షల కోట్ల లాభాలు సంపాదించాయి. ప్రతి సంవత్సరం ఈ లాభాలు పెరుగుతూనే వున్నాయి. మరి ఆ లాభాలు ఏమయ్యాయి..?

అదే కాలంలో రూ||8.63 లక్షల కోట్లు రుణాలు రద్దు చేయబడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ఈ రద్దు చేసిన బాకీలలో 85 శాతం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలదే. పార్లమెంటులో ప్రశ్నించినా బాకీలు రద్దు చేసిన కంపెనీల పేర్లు కూడా ప్రభుత్వం బయటపెట్టడం లేదు. ప్రజల డిపాజిట్లతో బ్యాంకు ఉద్యోగులు సంపాదించిన లాభాలు కార్పొరేట్ కంపెనీలకు తరలిపోతున్నాయి. వాస్తవంగా యిది ప్రజల సొమ్ము. దేశ ఆర్థిక వ్యవస్థకు చెందాల్సిన సొమ్ము,

ప్రైవేటీకరణ_వలన నష్టపోయేదెవరు?

ప్రైవేటు బ్యాంకులలో రూ||పదివేల కనీస నిల్వ (మినిమం డిపాజిట్) తో ఖాతాలు తెరవలేని దేశంలోని అత్యధిక శాతం ప్రజానీకం చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులు, పట్టణ పేదలు బ్యాంక్ సేవల నుండి దూరమౌతారు. ప్రైవేటు బ్యాంకులు కనీస నిల్వలేదని, డబ్బు జమచేసిన ఖాతా నుండి తీసుకున్న ఇతర ఛార్జీల రూపంలో విధించే మొత్తం మోయలేని భారంగా తయారవుతుంది. గత ఐదేళ్ల కాలంలో బ్యాంకులు రూ.12,500 కోట్ల మేర ఛార్జీలు వసూలు చేశాయి. ప్రైవేటీకరణ జరిగితే ఈ ఛార్జీలు మరింత భారమవుతాయి.

సామాన్య ప్రజల అవసరాలతో ఏ మాత్రం నిమిత్తం లేని లాభాలు పెంచే వ్యాపారమే ప్రైవేటు బ్యాంకుల లక్ష్యం చిన్న, మధ్య తరగతి రైతులు, వ్యాపారులు, కుటీర (చిన్న) పరిశ్రమలు, మహిళా పొదుపు సంఘాలు మొదలైన ప్రాధాన్యతా రంగాల రుణాలు కనుమరుగౌతాయి. బ్యాంకు బ్రాంచీలు సేవలు పట్టణ ప్రాంతాలకే పరిమితమౌతాయి. గ్రామీణాభివృద్ధి కుంటుపడుతుంది.

Yes Bank లాంటి అనేక బ్యాంకులు దివాలాకి కారణం ప్రజల డిపాజిట్లను డైరెక్టర్ల స్వంత కంపెనీల అవసరాలకు వాడుకొని దివాలా తీయటం. కనుక కార్పొరేట్ కంపెనీల చేతిలో ప్రజల సొమ్ముకి భద్రత వుండదు. బ్యాంకుల జాతీయకరణ ముందు పరిస్థితులు మళ్లీ మొదలవుతాయి.

వీటన్నిటికి తోడు బ్యాంక్ లాంటి ఆర్థిక సంస్థలు ఒడిదుడుకులలో వున్నపుడు 'బెయిల్ ఇన్' క్లాజు ద్వారా డిపాజిట్ సొమ్ముని వినియోగించుకొనే అవకాశం కల్పించిన FRDI బిల్లు, ప్రజా వ్యతిరేకత బ్యాంక్ యూనియన్ల నిరసనలలో 2017లో ప్రభుత్వ రద్దు చేసింది. కాని అదే బిల్లు పై పై మెరుగులతో ఆర్థిక సేవల 'నియంత్రణ - అభివృద్ధి' (FSRD) పేరుతో ప్రభుత్వం తయారు చేసింది. కాబట్టి ఒక పక్క బ్యాంకుల ప్రైవేటైజేషన్ మరో పక్క డిపాజిటర్ల సొమ్ముకి ప్రమాదం తెచ్చే FSRD చట్టమైతే ఎంత ప్రమాదమో ఆలోచించండి.

అందుకే బ్యాంక్ ఉద్యోగ సంఘాలు

ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఉపసంహరించాలని

ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేసే సంస్కరణలను ఉపసంహరించాలని

బ్యాంకుల మనుగడకే ప్రమాదంగా మారిన మొండి బాకీల వసూలుకు తగిన చట్టాలు చేసి కార్పొరేటు రుణాలను వసూలు చెయ్యాలని కోరుతున్నాయి.

డిపాజిటర్ల సొమ్ము భద్రత కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ కోసం  సామాన్య ప్రజానీకం మద్దతు నివ్వాలని,బ్యాంక్ ఉద్యోగులు విజ్ఞప్తి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "What are the real reasons for the losses of banks"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0