Admission to the hospital without covid + ve report
Covid +ve రిపోర్ట్ లేకున్నా ఆసుపత్రిలో అడ్మిషన్
- పలు సవరణలు చేసిన కేంద్రం
 - నూతన మార్గదర్శకాలు ఇవే..
 
- కొవిడ్ ఆరోగ్య కేంద్రం(ఆసుపత్రులు)లో చేర్చుకునేందుకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ పత్రం తప్పనిసరి కాదు. వైరస్ అనుమానిత బాధితులను ఆసుపత్రుల్లో చేర్చుకుని చికిత్స అందించాల్సిందే.
 - కారణమేదైనా సరే.. ఏ రోగికి కూడా వైద్య సేవలు నిరాకరించొద్దు.
 - వేరే ప్రాంతానికి చెందిన రోగులకు కూడా ఆక్సిజన్ లేదా అత్యవసర ఔషధాలు ఇవ్వాలి.
 - వేరే నగరం నుంచి వచ్చిన బాధితులు సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించలేదని ఆసుపత్రుల్లో చేర్చుకోకుండా ఉండొద్దు.
 - ఎలాంటి గుర్తింపు కార్డు లేకున్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని చేర్చుకోవాలి.
 - అన్ని ఆసుపత్రులు డిశ్చార్జ్ పాలసీని కచ్చితంగా పాటించాలి. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఆధారంగానే చేసుకునే ఆసుపత్రిలో చేర్చుకోవాలి.
 - అంతగా హాస్పిటల్ అవసరం లేనివారిని డిశ్చార్జ్ చేయాలి.
 - ఈ నూతన మార్గదర్శకాలపై ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు మూడు రోజుల్లోగా ఉత్తర్వులు, సర్క్యులర్లు జారీ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
 



0 Response to "Admission to the hospital without covid + ve report"
Post a Comment