Responsibilities of Kovid Victims to Teachers
టీచర్లకు కోవిడ్ బాధితుల బాధ్యతలు
గుంటూరు జిల్లా అధికారులు వినూత్న ప్రయోగం
14 రోజుల పాటు రోగుల బాగోగులు చూడాలి
మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులా....
ఇప్పుడు మీకోక బాధ్యత అప్పగిస్తున్నాం... ఇప్పటి నుంచి మీరు కోవిడ్ బాధితులకు 14 రోజుల పాటు కేర్ టేకర్ గా పనిచేయాలి... ఇది గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సెల్ ఫోన్ లకు అధికారులనుంచి వస్తున్న సందేశాలు. దీంతో ఉపాధ్యాయులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉపాధ్యాయుల బోధనా సిలబస్ లో కోవిడ్ బాధితుల కేర్ టేకింగ్ అనే అంశం కొత్తగా చేరింది. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ అధికమవుతుండటంతో గుంటూరు జిల్లా అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. కరోనా బారిన పడి హోమ్ ఇసోలేషన్ లో వున్న వారి బాగోగులు 14 రోజులపాటు కనుక్కుంటూ ప్రతిరోజూ ఆ వివరాలు ప్రతిరోజూ అధికారులు నిర్దేశించిన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. కోవిడ్ బాధితుల వద్దకు స్వయంగా వెళ్లకుండా ఫోన్ ద్వారానే వారి యోగక్షేమాలు కనుగొనే వెసులుబాటు వారికి కల్పించారు. ఉపాధ్యాయుల ఫోన్ లకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న సందేశంలో ముందుగా ఆ ఉపాధ్యాయుని పేరు, హోదాను ప్రస్తావించి, వారిని కోవిడ్ కేర్ టేకర్ గా నియామకం చేస్తున్నట్టు వున్నది. ఆ ఉపాధ్యాయుడు విచారించాల్సిన కరోనా బాధితుని పేరు, చిరునామా, ఐడి నంబరు, ఫోన్ నంబరును పూర్తిగా వివరించారు. వెంటనే మరొక సందేశాన్ని పంపించారు. వారికి కేటాయించిన కరోనా బాధితుని యోగక్షేమాలను ప్రతిరోజూ ఫోన్ ద్వారా విచారించి, ఆ వివరాలను వెబ్ సైట్ లో పొందుపరచాలంటే ఆ వెబ్సెట్ ఐడీని ఇచ్చారు. ఆ ఉపాధ్యాయుడు కోవిడ్ బాధితుని నుంచి ప్రతిరోజూ ఏయే వివరాలు సేకరించాలనే విషయమై ఒక ప్రశ్నావళి ఇచ్చారు. ఉపాధ్యాయుడు క రోనా బాధితునికి ఫోన్ చేయగానే ముందుగా అతని పేరుతో పలకరించాలి. ఆరోగ్యం ఎలా వున్నది వివరాలు తెలుసుకోవాలి. హోం ఐసోలేషన్ కిట్ ఇచ్చినదీ: లేనిదీ తెలుసుకోవాలి. ఏ. ఎన్ ఏం వస్తున్నారా? లేదా? అనే విషయం తెలుసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే వెంటనే 104 నంబరుకు కాల్ చేయాలని సూచించాలి. ఈ ప్రశ్నలు అన్నింటిని 14 రోజులపాటు ప్రతిరోజూ బాధితుదిని అడిగి వెంటనే అధికారులు ఇచ్చిన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలి.
సామాజిక బాధ్యతగా నిర్వర్తిస్తాం.
ఎస్ రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు, మునిసిపల్ టీచర్స్ ఫెడరేషన్
ఒక ప్రభుత్వ ఉద్యోగిగా అధికారులు అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించేందు కు ఉపాధ్యాయులు సిద్ధంగా వున్నారు. దీనిని మేము ఒక సామాజిక బాధ్యతగా భావి స్తాము. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితులలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. ఎంతోమంది కరోనా బారిన పడి మరణించారు. మరెంతో మంది ఆసుపత్రులలో చికిత్స పొందుతు న్నారు. ఉపాధ్యాయులందరికి యుద్ధప్రాతిపదికన వాక్సిన్లు వేయాలి. కోవిడ్ వారియర్ లుగా ఉపాధ్యాయులను గుర్తించాలి. ఉపాధ్యాయుల కోసం ఆసుపత్రులలో ప్రత్యేకంగా పడకలు కేటాయించాలి.
0 Response to "Responsibilities of Kovid Victims to Teachers"
Post a Comment