Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Kovid Command Control

ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్

AP Kovid Command Control

60 సంవత్సరాలు దాటిన వయోవృద్ధులు కోవిడ్ బారి పడకుండా కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS ద్వారా విడుదల చేయబడిన  సూచనలు.

60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు   కోవిడ్ ప్రమాదము నుండి వారు  ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం జరిగింది.

60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారు, మరి ముఖ్యముగా కింది సూచించిన ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, పల్మనరీ డిసీజ్ (సిఓపిడి), బ్రోన్కియాక్టసిస్, పోస్ట్ టిబి  మధ్యంతర ఊపిరితిత్తుల వ్యాధులు, హార్ట్ అటాక్ వంటి దీర్ఘకాలిక గుండె జబ్బులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, ఆల్కహాలిక్ వలన ఏర్పడిన  వైరల్ హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక కాలేయ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, స్ట్రోక్ వంటి దీర్ఘకాలిక న్యూరోలాజిక్ పరిస్థితులు గల వారు, డయాబెటిస్, రక్తపోటు, క్యాన్సర్ వంటి అనారోగ్యాలతో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


తమ పనులు తామే నిర్వహించుకోగల వృద్దులకు సూచించిన జాగ్రత్తలు.

  • సాధ్యమైనంత వరకూ ఇంటి నుండి బయటకు రాకుండా ఉండడానికి ప్రయత్నించండి.
  • చుట్టాలను, సందర్శకులను ఇంట్లో ఉంచుకోకండి, వారిని  రావద్దని చెప్పండి, అత్యవసరము అయితే మీరు వారితో వీడియొ కాల్ లో మాట్లాడండి. 
  • ఇతరులతో అత్యవసర  సమావేశం తప్పనిసరి అయితే, వారికి మీరు 1 మీటర్ దూరం లో ఉండండి.
  • మీరు ఒంటరిగా జీవిస్తుంటే, ఇంటికి అవసరమైన వస్తువులను పొందడము కోసం మీ పొరుగువారు ఆరోగ్యముగా ఉంటే వారి సహాయము పొందండి.
  •  చిన్న మరియు పెద్ద సమావేశాలలో అస్సలు పాల్గొనవద్దు.
  • సాధ్యమైనంత వరకు ఇంటికి అవసరపడిన కార్యక్రమాలు మొబైల్ ఫోన్ ద్వారా నిర్వహించండి.
  • రోజూ ఇంటి వద్ద  తేలికపాటి వ్యాయామం మరియు యోగా నిర్వహించండి.
  •  కనీసం 20 సెకన్ల పాటు నీరు సబ్బుతో చేతులు కడుక్కోవడం ద్వారా పరిశుభ్రత పాటించండి. ముఖ్యంగా భోజనం చేసే ముందు మరియు వాష్‌ రూమ్ ఉపయోగించిన తర్వాత. 
  • తరచుగా తాకే కళ్ళజోడు వంటి  వస్తువులను ఎప్పటికప్పుడు  శుభ్రపరచండి.
  • తుమ్ము మరియు దగ్గు వచ్చే సందర్భం లో టిష్యూ లేదా రుమాలు ను ఉపయోగించండి. దగ్గు లేదా తుమ్ము తరువాత టిష్యూ ను  మూసి వేసిన డబ్బాలో పారవేసి మీ రుమాలు మరియు చేతులు శుభ్రముగా కడగాలి
  • సరైన పోషకాహారం గల ఆహారాన్ని తీసుకోండి. ఇంట్లో వండిన తాజా వేడి భోజనం భుజించండి,తరచుగా నీరు త్రాగండి మరియు రోగనిరోధక శక్తిని పెంచే తాజాగా ఉన్న పళ్ల రసాలు తీసుకోండి.
  • మీకు  రోజువారీ సూచించిన మీ ఔషధాలను క్రమం తప్పకుండా వాడండి.
  • మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండండి. మీలో జ్వరం, దగ్గు లేదా శ్వాస ఇబ్బంది లేదా ఏదైనా ఇతర ఆరోగ్య సమస్య తలఎత్తినప్పుడు వెంటనే సమీప హాస్పిటల్ ను  సంప్రదించి వారు ఇచ్చిన సలహా మరియు వైద్యాన్ని అనుసరించండి
  • వీడియో  కాల్ లేదా కాన్ఫరెన్సు ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తో  మాట్లాడండి. అవసరపడిన సందర్భాల్లో వారి సహాయం తీసుకోండి.
  • కరోనావైరస్ యొక్క వ్యాధి లక్షణాలు జ్వరం / దగ్గు / శ్వాస సమస్య ప్రదర్శిస్తున్న వ్యక్తి తో సన్నిహితంగా ఉండకండి.
  • స్నేహితులు మరియు సమీప వ్యక్తుల కు షేక్ హ్యాండ్ ఇవ్వకండి,  లేదా వారిని కౌగిలించుకోకండి
  • ఉద్యానవనాలు, మార్కెట్లు మరియు మతపరమైన వంటి  స్థలాలకు  మరియు రద్దీ ప్రదేశాలకు వెళ్ళకండి.
  • మీ వట్టి చేతులలో దగ్గడం, తుమ్మడం చేయకండి. 
  • మీ చేతులతో  మీ కళ్ళు, ముక్కు మరియు ముఖం తాకకండి.
  • స్వంత వైద్యం చేసుకోకండి.
  • రొటీన్ చెకప్ కోసం  ఆసుపత్రికి వెళ్లకండి. టెలి సంప్రదింపులు తో ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తి లేదా సంస్థ ను సంప్రదించండి.
  • మీ ఇంటికి మీ  కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను ఆహ్వానించకండి.
  • వేసవి కారణంగా శరీరం లో ఏర్పడే డీ హైడ్రేషన్ నివారించడానికి. తగినంత నీటిని తీసుకోండి. ముఖ్యముగా  గుండె మరియు కిడ్నీ వ్యాధి ఉన్నవారు  జాగ్రత్తగా ఉండాలి.
  • సీనియర్ సిటిజన్ల కు  సంరక్షకులుగా పనిచేసేవారికి సూచించిన  సలహాలు.
  • సీనియర్ సిటిజన్స్ కు  సహాయం చేయడానికి ముందు చేతులు శుభ్రముగా  కడుక్కోవాలి
  • సీనియర్ సిటిజన్స్ కు  సహాయము చేసేటప్పుడు ముక్కు మరియు నోటిని కప్పి ఉంచేలా సరైన మాస్కు లేదా వస్త్రాన్ని వాడాలి.
  • సీనియర్ సిటిజన్స్ తరచుగా ఉపయోగించే వాకింగ్ స్టిక్, వాకర్, వీల్-కుర్చీ, బెడ్‌ పాన్ వంటి వాటి ఉపరితలాలను శుభ్రపరచాలి.
  • సీనియర్ సిటిజన్స్ చేతులు శుబ్రపరచుకోవడానికి  ఆమెకు / అతనికి సహాయం చేయాలి.
  • సీనియర్ సిటిజన్స్ కు సరైన ఆహారం మరియు నీరు ఉండేలా చూసుకోవాలి.
  • సీనియర్ సిటిజన్స్  యొక్క ఆరోగ్యాన్ని ఎల్లప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.
  • సీనియర్ సిటిజన్ల జ్వరం / దగ్గు / శ్వాస ఇబ్బంది తో బాధపడుతుంటే వారి దగ్గరకు వెళ్ళకండి.
  • సీనియర్ సిటిజన్లను పూర్తిగా మంచానికే పరిమితం చేసి ఉంచకండి. 
  • చేతులను శుబ్రపరచుకోకుండా  సీనియర్ సిటిజన్‌ను తాకకండి.
  • సీనియర్ సిటిజన్ల కు ఈ క్రింది లక్షణాలు వళ్లు నొప్పులతో  లేదా అవి లేకుండా జ్వరం, నిరంతరము దగ్గు లేదా హఠాత్తుగా శ్వాస ఆడకపోవడం, అసాధారణంగా ఆకలి లేకపోవడం, లేదా ఆహారం తిన లేకపోవడం వంటి వి  ఏర్పడితే వెంటనే హెల్ప్ లైన్ ను సంప్రదించాలి. 

సీనియర్ సిటిజన్ల మానసిక ఉల్లాసానికి సూచించిన సలహాలు.

  • ఇంట్లో వారితో మరియు బంధువులతో మొబైల్ ద్వారా సంబంధాలు కలిగి  ఉండండి.
  • ఇరుగు  పొరుగువారితో సరైన సామాజిక దూరం నిర్వహిస్తూ సంబంధాలు నిర్వహించండి. ప్రజలతో గుమ్ము కూడడం వంటి పనులు చేయకండి.
  • శాంతియుత మరియు ప్రశాంత  వాతావరణాన్ని కల్పించుకోండి.
  • సంగీతం వినడం, చదవడం పెయింటింగ్ వంటి పాత అభిరుచులను తిరిగి మొదలు పెట్టండి.
  • అధీకృత సంస్థలు మరియు ప్రభుత్వము నుండి విడుదల చేసే సమాచారమును మాత్రమే విశ్వసించండి.
  • ఒంటరితనం లేదా విసుగును నివారించడానికి కోసం వాడే పొగాకు, ఆల్కహాల్  మరియు ఇతర మత్తుమందుల వంటి వాటికి దూరంగా ఉండండి.
  • మీరు ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతూ ఉంటే దాని నుండి ఉపశమనం కోసం తగిన సలహాలు సూచనలు కోసం దయచేసి హెల్ప్ లైన్  (08046110007) కు కాల్ చేయండి.
  • మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయకండి.
  • ఎప్పుడూ ఒకే  గదిలో ఉండి మీకు మీరు నిర్బంధించుకోకండి.
  • ఏదైనా సంచలనాత్మక వార్తలు లేదా సోషల్ మీడియా పోస్ట్లు గుడ్డిగా అనుసరించకండి.
  • ధృవీకరించబడని ఏదైనా వార్తలు లేదా సమాచారం ను మరింత మందికి పంపి ప్రచారం చేయకండి.
  •  వృద్దుల మానసిక స్థితిలో మార్పు లు గమనించినపుడు, పగటిపూట అధికంగా మగత తో ఉండడం, సరిగా ప్రతిస్పందించలేక పోవడం,సరిగా మాట్లాడ లేకపోవడం,  అంతకు ముందు చూసిన  బంధువులను మరియు వ్యక్తులను గుర్తించలేకపోవడం వంటి కొత్త లక్షణాలు గమనించినపుడు వెంటనే హెల్ప్‌ లైన్‌ను సంప్రదించాలి.
  • ప్రభుత్వ సూచనలను ఎప్పటికప్పుడు పాటించండి

 డాక్టర్ అర్జా శ్రీకాంత్

స్టేట్ కోవిద్ నోడల్ ఆఫీసర్

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Kovid Command Control"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0