Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

The cabinet meeting today was a key discussion on Kovid prevention measures

మంత్రివర్గ భేటీ నేడు కోవిడ్ నివారణ చర్యలపై కీలక చర్చ

The cabinet meeting today was a key discussion on Kovid prevention measures

సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం భేటీ కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన సమావేశం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం సమావేశ మందిరంలో కేబినెట్ సమావేశం జరగనుంది.. ఈ ఏడాదిలో ఇది రెండోది కావడం గమనార్హం. గత కేబినెట్ పంచాయతీ ఎన్నికల అనంతరం జరుగగా ఈ సారి పురపాలక, ఎంపీ టీసీ, జెడ్పీటీసీ, తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల అనంతరం జరగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో ప్రధానంగా కీలక బిల్లులకు మంత్రి వర్గం ఆమోదం తెలపనుంది. ప్రధానంగా రాష్ట్రంలో రోజురోజుకూ తీవ్రతరం అవుతున్న కరోనా కట్టడి పై కీలక చర్చ జరుపనున్నారు. కోవిడ్ నివారణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం, క రోనా రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలు పై చర్చ జరగనుంది. అలాగే ఆక్సిజన్ సరఫరా, బెడ్స్, రెమిడిసివర్ కొరతా వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో బుధవారం నుంచి అమలు కానున్న పాక్షిక కర్ప్యూ పై చర్చించనున్నారు. అలాగే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి.ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లేకపోవడంతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆన్లైన్లో ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో బడ్జెట్ కు సంభందించి అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. నెల్లూరు జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణం, గంగవరం పోర్టు బదలాయింపు, ప్రకాశం డెయిరీ అమూల్ సంస్థకు అప్పగింత, రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచే ఆరవ తరగతి నించి సీబీఎస్ సిలబస్ అమలు తదితర అంశాలపై చర్చ జరగనుంది. అదే విధంగా ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ఉత్పత్తి ఆధారిత రాయితీలు అందించేలా నూతన నిబంధనల విషయం పై చర్చించనున్నారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెంపు, బకాయిలు అంశం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్మన్ ల పెంపు దలకు సంభందించిన బిల్లు తో పాటు, రాష్ట్రంలో హెచార్సీ కార్యాలయం ఏర్పాటు, వాహనాల కాలుష్య నివారణకు సంభందించిన కీలకమైన బిల్లులకు ఆమోదముద్ర పడనుంది. అలాగే విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు, అమరావతి రాజధాని భూముల వ్యవహారం తదితర అంశాలపై కూడా మంత్రి మండలిలో ప్రస్తావనకు రానున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా ఘన విజ యం తో పాటు మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ విజయభేరీ మోగించిన నేపథ్యంలో ఆ ఆనందాన్ని మంత్రివర్గ సమావేశం పంచుకోనుంది.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "The cabinet meeting today was a key discussion on Kovid prevention measures"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0