Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Decision on Tent exams after 3 weeks

టెన్త్ పరీక్షలపై 3వారాల తరువాత నిర్ణయం

Decision on Tent exams after 3 weeks

  • ఇంటర్ వాయిదా వేశాం
  • హైకోర్టుకు ప్రభుత్వం వివరణ
  • విచారణ జూన్ 2కు వాయిదా

 పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. కరోనా వైరస్ విఙంభణనేపథ్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలను మాత్రం వాయిదా వేశామని వివరణ ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలు, పిటిషనర్ల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సమీక్షించిన అనంతరం ఈనెల 5వ తేదీ నుంచి నిర్వహించాల్సిన ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని నిశ్చయించినట్లు ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఎస్ శ్రీరాం కోర్టుకు నివేదించారు. వచ్చే మూడు వారాల్లో పరిస్థితిని అంచనావేసి ఆపై టెన్త్ పరీక్షల నిర్వహణపై తుది నిర్ణయానికి రావాలనే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ పలువురు విద్యార్థులు హైకోర్టులో వేసిన పిటిషన్ల నేపథ్యంలో వీటిపై అధికారులతో సమీక్షించి పునరాలోచించాలని ధర్మాసనం సూచించింది. ఇందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఏజీ శ్రీరాం ఇంటర్ పరీక్షల వాయిదా విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తదుపరి పరీక్షల తేదీలను ఖరారు చేశారా అని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదల చేసి రెండు, మూడు రోజుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు కదా అని ధర్మాసనం సందేహాలు వ్యక్తం చేసింది. పరీక్షలకు హాజరయ్యేందుకు విద్యార్థులకు తగిన గడువు ఇస్తామని ఏజీ వివరించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. వచ్చే మూడు వారాల్లో తేదీని నిర్ణయిస్తామని ఏజీ కోర్టుకు నివేదించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Decision on Tent exams after 3 weeks"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0