Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Krishnapatnam Ayurvedam Full Report in Telugu

 Krishnapatnam Ayurvedam Full Report in Telugu.

Krishnapatnam Ayurvedam Full Report in Telugu

క్రిష్ణ పట్నం ఆయుర్వేదం రిపొర్టు పూర్తి తెలుగు పాఠం..5 రకాల మందులు, తయారీ పధ్ధతులు.

 జిల్లా పంచాయతి అధికారి వారి కార్యాలయం,

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,

తేది : 17-05- 2021.

విచారణ నివేదిక

శ్రీయుత జిల్లా కలెక్టర్‌, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి ఆదేశముల మేరకు ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు కోవిడ్‌ 19 నకు ఆయుర్వేద చికిత్స పై జిల్లా పంచాయతి అధికారి వారు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి వారు, రెవిన్యూ డివిజనల్‌ అధికారి, నెల్లూరు వారు, ఆయుర్వేద డాక్టర్లు మరియు స్థానిక మండల పరిషత్‌ అబివృద్ది అధికారి & తహసిల్దార్‌ వారితో విచారణ జరిపి సమర్పించు నివేదిక 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామం నందు శ్రీ బొరిగి ఆనందయ్య అనువారు కోవిడ్‌ 19 నకు ఆయుర్వేద చికిత్స చేయుచున్నారు. అతను, గొలగమూడి వెంకయ్య స్వామి వారి శిష్యులైన శ్రీ గురవయ్య స్వామి మరియు చెన్నై పట్టణం రెడ్‌ హిల్స్‌ ప్రాంతమునకు చెందిన వివేకానంద అను సిద్ద వైద్యుల వద్ద ఆయుర్వేద చికిత్స నేర్చుకొన్ననని తెలిపియున్నారు. ఇతను గతములో సర్పంచ్‌ గా మరియు ఎం.పీ.టి.సి గా పనిచేసియున్నానని తెలిపియున్నారు. తను ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ మందు రోగులకు అందిస్తున్నని తెలిపినారు.

తాను, గత నెల శ్రీరామ నవమి నుండి అనగా 21-4-2021 నుండి కోవిడ్‌ 19 నకు చికిత్స చేయుచున్నననియు, మొదట పదులలో పేషంట్లు వచ్చేవారనియు తదుపరి ఆ సంఖ్య వందలకు పెరిగి ప్రస్తుతము రోజుకు 4 వేల నుండి 5 వేల మంది వరకు తాను ఇచ్చు ఆయుర్వేద మందు కొరకు వచ్చుచున్నారని నదని తెలిపినారు.

సదరు శ్రీ బొరిగి ఆనందయ్యను తాను కోవిడ్‌ 19 నకు తయారుచేయు మందుల యొక్క వివరములు తెలుపమని కోరగా వారు ఈ క్రింది విధముగా తెలిపియున్నారు.

అతను, కరోన నివారణ నిమిత్తం 5 (అయిదు) రకములైన మందులు తయారుచేసి పేషంట్లకు ఇత్యము.

మొదటి రకము: 1P - ఊపిరితిత్తులు శుభ్రం చేయును కరోనా పాజిటివ్ ఉన్న వారికి, లేని వారికి

రెండవ రకము: 2F - కరోనా పాజిటివ్ ఉన్న వారికి

మూడవ రకము: 3L - కరోనా పాజిటివ్ ఉన్న వారికి



నాల్గవ రకము: 4K - కరోనా పాజిటివ్ ఉన్న వారికి


ఐదవ రకము: 5I - ఆక్సిజన్ తగ్గిన వారికి, కంటి డ్రాప్స్

ఆయుర్వేద డాక్టర్ల నివేదిక


తదుపరి స్టానికంగా హాజరైన ప్రజలతో మాట్లాడుట జరిగినది, హాజరైన ప్రతి ఒక్కరు సదరు ఆయుర్వేద మందు పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినారు. ఎవ్వరును సదరు మందు వలన ఎటువంటి చెడుప్రభావములకు లోనుకాలేదని తెలిపియున్నారు.

లోకాయుక్తకు సమర్పించిన పూర్తి అధికారిక రిపోర్టు కొరకు క్రింద క్లిక్ చేయండి.


Click here for Report

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Krishnapatnam Ayurvedam Full Report in Telugu"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0