Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Check with ventilation for covid ‘air’

Covid ‘గాలి’కి  వెంటిలేషన్‌తో చెక్‌

Check with ventilation for covid ‘air’


  • మాస్క్‌లు, భౌతికదూరంతో పాటు వెంటిలేషన్‌ ఉండాల్సిందే
  • నూతన అడ్వైజరీ విడుదల చేసిన కేంద్రం
  • అడ్వైజరీ తాజా సూచనలివే..
  • ఎక్కువ వెంటిలేషన్‌ వచ్చేలా..

సాధారణంగా కొవిడ్‌ బాధితుడు మాట్లాడటడం, తుమ్మడం, దగ్గడం, నవ్వడం వంటికి చేసినప్పుడు వైరస్‌ కణాలు బయటకు వస్తాయి. ఇందులో రెండు రకాల కణాలుంటాయి. పెద్దపెద్ద డ్రాప్‌లెట్స్‌ నేరుగా భూ ఉపరితలం పడతాయి. అలా పడిన ప్రదేశాలను ఇతరులు ముట్టుకుని అదే చేతులతో ముఖం, నోటిని తాకితే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటిలోపల నేల, తలుపు హ్యాండిల్స్‌ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేగాక, చేతులను తరచూ సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. 

ఇక చిన్న చిన్న తుంపరలు గాల్లో దాదాపు 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసిఉంచే గదుల్లో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులను ఎప్పుడూ తెరిచి ఉంచడంతో పాటు కిటికీల వద్ద ఫ్యాన్లు అమర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. 

కార్యాలయాల్లో అయితే ఏసీలు వేయడం తలుపులు, కిటకీలు మూసివేస్తారు. అలా చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి

రెండు మాస్క్‌లు మంచిది..

కరోనా కట్టడికి మాస్క్‌ అత్యవసరం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం ఉంటుంది. ఒక సర్జికల్‌ మాస్క్‌తో పాటు ఒక కాటన్‌ మాస్క్‌ను కలిపి పెట్టుకోవాలి. సర్జికల్‌ మాస్క్‌ ఒక్కటే పెట్టుకున్నట్లయితే దాన్ని ఒకేసారి వినియోగించాలి. అయితే డబుల్‌ మాస్క్‌లో వాడినప్పుడు కనీసం 5 సార్లు ఉపయోగించుకోవచ్చు. అయితే పెట్టుకున్న ప్రతిసారి దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి.

కమ్యూనిటీ స్థాయి పరీక్షలు..

గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలి. ఇందుకోసం ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు రాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షలు చేయడంతో శిక్షణ ఇవ్వాలి. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనలను తప్పనిసరిగా పాటించి.. వైరస్‌ ఆట కట్టిద్దామని నిపుణుల బృందం పిలుపునిచ్చింది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Check with ventilation for covid ‘air’"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0