Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cash transfer for lunch

మధ్యాహ్న భోజనానికి నగదు బదిలీ

Cash transfer for lunch


  • ప్రతి విద్యార్థికి నెలకు రూ. 100
  • నేరుగా బ్యాంకు ఖాతాలో జమ
  •  కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

చిన్నారి విద్యార్థుల పౌష్టికాహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వేళ వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించే దిశగా చర్యలు చేపట్టింది. కొవిడ్తో నెలల తరబడి పాఠశాలలు మూతబడ్డాయి. దీంతో స్కూళ్లలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో 1-8 తరగతి విద్యార్థులకు పౌష్టికాహార సమస్య తలెత్తకుండా ఉండాలని భావించింది. మధ్యాహ్న భోజన పథకం నిధులను నేరుగా విద్యార్థులకు అందించాలని నిర్ణయించింది. ఇందుకు నగదు బదిలీ పథకాన్ని జోడించడం ద్వారా, అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థి బ్యాంకు ఖాతాలో సొమ్మును జమ చేయాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రాయాల్ తెలిపారు. ప్రదాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నిరుపేదలకు అందిస్తున్న 5 కేజీల ఆహార ధాన్యాలకు ఇది అదనంగా కొనసాగుతుందని పేర్కొ న్నారు. ప్రత్యేక సంక్షేమ చర్యల కింద అదనంగా రూ. 1200 కోట్ల ను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇవ్వనుంది. వన్లైమ్ స్పెషల్ వెల్ఫేర్ కార్యక్రమం ద్వారా 11.8 కోట్ల మంది విద్యార్థులకు ప్రయోజం కలగనుంది. దేశంలోని 11.2 లక్షల ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలోని విద్యార్థులకు ఈ ప్రయోజనాలు అందుతాయి. అయితే పోషకాహార భద్రతను అందించడానికి ఈ మొత్తం సరిపోదని ఆహారహక్కు కార్యకర్తలు అంటున్నారు.

వంట ఖర్చు కేటాయింపు

2021-22లో మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం రూ.11,500 కోట్లు కేటాయించింది. పప్పుధాన్యాలు, కూరగాయలు, వంటనూనె, ఉప్పువంటి పదార్థాల ధరలతో కూడిన వంట ఖర్చులో ఇది అతిపెద్దభాగం. రోజుకు ఒక విద్యార్థికి (1-5 తరగతి) వంట ఖర్చుకు రూ. 4.97, 6-8 తరగతులకు రూ. 7.45గా నిర్ధారించారు. ఇందులో కేంద్రం 60 శాతం చెల్లిస్తుంది. దీనిపై నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నెలకు రూ. 100 అంటే సగటున రోజుకు రూ.4 కంటే తక్కువని, పైగా బ్యాంకు లావాదేవీలకు కొంత వ్యయం అవుతుందని పేర్కొంటున్నారు. పోషకాహార భద్రతను నిర్ధారించడానికి గుడ్లు, కూరగాయలు, పండ్లు, పప్పు, నూనెతో సహా మెరుగైన టేక్ మ్ రేషన్లు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఏడాదికి సుమారు 200 పాఠశాల రోజుల లెక్కన ఒక్కో విద్యార్థికి రూ.900- రూ. 1300 వంట ఖర్చు అవుతుంది. గతేడాది కూడా మహమ్మారి కారణంగా స్కూళ్లు మూతబడ్డాయి. అందుచేత గతేడాది బకాయిలను కూడా చెలిస్తే కొంతవరకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cash transfer for lunch"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0