Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona test with bees soon

త్వరలో తేనెటీగలతో కారోనా టెస్ట్

Corona test with bees soon

 కరోనా విషయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లలో టెస్టింగ్‌, వ్యాక్సినేషన్‌ ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న టెస్టింగ్స్‌లో ర్యాపిడ్‌/యాంటీ జెన్‌, ఆర్టీ- పీసీఆర్‌ ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇవి కాకుండా మరికొన్ని కొత్త రకాలను అందుబాటులోకి తీసుకురావాలని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. అందులో ఇప్పుడు తేనెటీగల టెస్ట్‌ ఒకటి చేరింది. కరోనా టెస్టుకు తేనెటీగల్ని ఉపయోగించేలా డచ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. ఈ విధానంలోనూ కచ్చితత్వం బాగుందని చెబుతున్నారు. అయితే ఈ విధానం ప్రయోగం ఇంకా పూర్తవ్వలేదు. కరోనా వైరస్‌కు ఓ రకమైన వాసన ఉంటుందట. ఆ వాసనను పసిగట్టేలా తేనెటీగలకు ట్రైనింగ్‌ ఇచ్చారు పరిశోధకులు. అంటే కరోనా వైరస్‌ ఉన్న స్వాబ్‌ను తేనెటీగ దగ్గరకు తీసుకెళ్తే దాని నాలుక ముడుచుకుంటుందట. దాని బట్టి ఆ శాంపిల్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలుస్తారట. 


ప్రస్తుతం దీని కోసం 150 వరకు తేనెటీగలకు ట్రైనింగ్‌ ఇచ్చి పరీక్షిస్తున్నారు. తొలుత టెస్టింగ్‌ చేసినప్పుడల్లా తేనెటీగలకు షుగర్‌ వాటర్‌ ఇస్తారు. కొన్నిసార్లు ఇలా జరిగాక వాటికి అలవాటు అయిపోతుంది. దాని వల్ల శాంపిల్‌లో కరోనా ఉంటే వెంటనే రియాక్ట్‌ అవుతాయి. క్రమంగా వాటి గుర్తింపు సమయం సెకన్లకు చేరుకుంటుంది. అంటే శాంపిల్‌కు టచ్‌ చేసిన వెంటనే తేనె టీగలు రియాక్ట్‌ అయ్యి కరోనా ఉందో లేదో చెప్పేస్తాయి. ఈ విధానం పేద దేశాలకు ఉపయుక్తంగా ఉంటుందని ప్రయోగం చేస్తున్న వాగెనిజెన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొలిమరేజ్‌ చెయిన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) టెస్టులు చేసేందుకు అవసరమైన సాంకేతికత, సామగ్రి సమకూర్చుకోలేని దేశాలు ఈ టెస్టులు చేయవచ్చని తెలిపారు. తేనెటీగలు ప్రతి చోటా అందుబాటులో ఉండటం వల్ల, వాటికి శిక్షణ ఇచ్చి టెస్టులకు సిద్ధం చేయొచ్చని వారు చెప్పారు. ఈ విధానంలో కచ్చితత్వం 95 శాతం ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ వివరాలు ఏవీ ఇంకా పబ్లిష్‌ చేయలేదని, ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయని వాగెనిజెన్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona test with bees soon"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0