Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Can I get vaccinated while pregnant?

 Coronavirus గర్భము తో ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకోవచ్చా ?

Can I get vaccinated while pregnant?


ఈ కొత్త కరోనా వైరస్‌ ప్రపంచానికి తెలిసి ఒకటిన్నర సంవత్సరాలు అవుతోంది. దీనికి వ్యతిరేకంగా యాంటిబాడీస్‌ తయారయ్యి దాని మీద దాడి చేసే వైరస్‌ శరీరంలో పెరగకుండా ఉండటానికి కరోనా వ్యా క్సిన్‌ తయారు చేయ్యడం జరిగింది. కానీ, మిగితా వ్యాక్సన్‌లాగా మెల్లగా అనేక మంది మీద అన్ని రకాలుగా ఎక్కువ సంవత్సరాలు పరిశోధనలు జరగకుండాకే అత్యవసరంగా ఎమర్జెన్సీగా ఇది కూడా ఒక ఫ్లూ వైరస్‌ జాతికి సంబంధించిదిగా పరిగణించి, తక్కువ కాంలో ట్రయల్‌స జరిపి తయారు చేశారు.అలాగే అత్యవసరంగా ప్రజలకు ఇవ్వడానికి ఆమెదింపబడినది.

కానీ, ఈ పరిశోధనలు గర్భం దాల్చిన వారి మీద చేయ్యలేదు. కాబట్టి, దాని ఫలితాలు దుష్ఫలితాలు గర్భిణీల మీద కడుపులో ఉన్న బిడ్డపైన ఎలా ఉంటాయి అనేది కచ్చితంగా చెప్పటం కష్టం. కాబటి ఐసీఎమ్‌ఆర్‌ గర్భీణీలలో కరోనావైరస్‌ ఇవ్వవచ్చు అనే మార్గదర్శకాలను ఇంకా విడుదల చేయలేదు. ఇప్పటీ వరకూ చూసిన అనుభవాల మేరకు గర్భీణీలు వ్యాక్సిన్‌ తీసుకోవడటం వలన మంచి, చెడు, తీసుకోకపోవడం వలన వచ్చే సమస్యలతో పోలిస్తే మంచి జరిగేది ఎక్కువ అని, చెడు తక్కువ అని తెలుపుతున్నారు. సీడీసీ, ఎఫ్‌డీఏ, ఏ సీఓజీ, ఆర్‌సీఓజీ, ఎఫ్‌ఓజీఎస్‌ఐ వంటి సంస్థలు గర్భంతో ఉన్నప్పుడు కూడా కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడమే మంచిది అని సూచనలు ఇవ్వడం జరిగింది.

ఎందుకంటే, కరోనా వైరస్‌సంక్రమించి దాని వలన ముప్పుకంటే, వ్యాక్సిన్‌ వలన వచ్చే దుష్ప్రభావాలు చాలా తక్కువ అని. ఇప్పటి దాకా వ్యాక్సిన్‌ తీసుకోవడం వలన వచ్చే చిన్నచిన్న ఇబ్బందులే అంటే, జర్వం, ఒళ్లునొప్పులు, వంటివే గర్భవతులకు కూడా రావచ్చు. దానికి పారసిటబాలు మాత్ర వేసుకోవచ్చు. ఎవరిలోనైనా అరుదుగా ఏ వ్యాక్సిన్‌కైనా వచ్చే తీవ్రమైన రియాక్షన్‌లు, దీనిలో కూడా ఉండవచ్చు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వలన యాంటిబాడీస్‌ తయారయ్యి అవి పిండంలోని బిడ్డకు కూడా చేరతాయి. దీంతో తల్లిబిడ్డల క్షేమంగా ఉండేటట్లు చేయడం జరిగింది.

మొదటి దశతో పోలిస్తే, ఈ సెకండ్‌ వేవ్‌లో 30 నుంచి 40 శాతం కంటే ఎక్కువ గర్భీణీలు కరోనా వైరస్‌ బారిన పడుతున్నారు. అదృష్టం కొద్ది మొదట్లోనే దీనిని గుర్తించి పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే చాలా వరకు సురక్షితంగా బయట పడుతున్నారు. ఇక దీర్షకాల వ్యాధులు ఉన్న గర్భవతులు, అధిక వయసు, అధిక బరువు ఉన్న వారిలో కొంచెం వ్యాధి తీవ్రత ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి వీరు కొంచెం వ్యాధి తీవ్రతను బట్టి ఎక్కువగా జాగ్రత్తలు, ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే గర్భవతులైన ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. మనదేశంలో గర్భీణీలు కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చుననే ఖచ్చితమైన మార్గదర్శకాలు వచ్చే వరకు ఆగి చూడాల్సి ఉంటుంది. ఈ లోపల ఒకవేళ వ్యాక్సిన్‌ అందరికి అందుబాటులోకి వస్తే గర్భీణీలు వారి డాక్టర్‌తో సంప్రదించి కొంత రిస్క్‌పైన వ్యాక్సిన్‌ తీసుకోవలసి ఉంటుంది.

వ్యాక్సిన్‌ తీసుకున్నా తీసుకోకపోయినా, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్క్‌ వేసుకోవటం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలు మాత్రం కొనసాగించవలసిందే. ఎందుకంటే వ్యాక్సిన్‌ నూటికి నూరుశాతం కరోనా వైరస్‌ను అరికడుతుంది అని నిర్ధారణ కాలేదు. కాబట్టి, వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో మళ్లీ కరోనా వచ్చినా, వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకుండా చాలా వరకు సురక్షితంగా బయటపడుతుండటం గమనించాలి.

-డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Can I get vaccinated while pregnant?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0