Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

High level meeting on exams today ..

పరీక్షలపై నేడు ఉన్నత స్థాయి భేటీ..     

High level meeting on exams today ..

  • రాజ్ నాధ్ అధ్యక్షతన కేంద్ర మంత్రులు , రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు , అధికారుల సమావేశం..
  •  నేడు కేంద్ర విద్యాశాఖ కీలక భేటీ
  • 12వ తరగతి బోర్డు పరీక్షలతో పాటు, ఇతర ప్రవేశ పరీక్షలపై చర్చ

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విద్యా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆదివారం కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలతో పాటు ఇతర ప్రవేశ పరీక్షలపై చర్చించనున్నారు. కరోనా విజృంభణ నేప థ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలతో పాటు జేఈఈ మెయిన్, నీట్ తదితర పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లోనూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు, వృత్తి విద్యా కోర్సులకు ప్రవేశపరీక్షలను ఎలా నిర్వహించాలనే ప్రతిపాదనలపై ఆదివారం జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు న్నాయి. ఈ భేటీకి హాజరుకావాల్సిందిగా అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల విద్యాశాఖ

మంత్రులు, విద్యాశాఖ కార్యదర్శులు, రాష్ట్రాల పరీక్షా బోర్డుల చైర్మన్లకు కేంద్ర విద్యాశాఖ లేఖలు రాసింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు జరుగనున్న ఈ వర్చువల్ సమావేశానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖియాల్, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, ప్రకాశ్ జవదేకర్ ఇందులో పాల్గొంటారు. రాబోయే పరీక్షలకు సంబంధించి తమ అభిప్రాయాలను ఈ సమా వేశంలో పంచుకోవాలని రాష్ట్రాల విద్యాశాఖ మం త్రులను పోఖియాల్ అభ్యర్థించారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విద్యారంగం లో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "High level meeting on exams today .."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0