Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Even if vaccinated .. the mask is a must.

 టీకాలు తీసుకున్నా.. మాస్క్ తప్పదు.

Even if vaccinated .. the mask is a must.


కొవిడ్‌-19 టీకాను కొన్నిదేశాల్లో ఇప్పటికే ఆరంభించేశారు. రేపో మాపో మనదగ్గరా అందుబాటులోకి రావటం తథ్యం. కరోనా టీకా తీసుకుంటే ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్టేనని, ఇకపై మాస్కు ధరించాల్సిన పనుండదనేది చాలామంది భావన. ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలేవీ పాటించాల్సిన అవసరం లేదని అనుకునేవారూ ఎందరో. ఆగండాగండి. అప్పుడే మరీ అంత ధీమా పనికిరాదు. కరోనా టీకా తీసుకున్నా కొంతకాలం వరకు మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. ఎందుకంటారా? తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌ టీకానే తీసుకుందాం. దీన్ని వేయించుకున్నాక 3 వారాల తర్వాత రెండో మోతాదు తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక మోడెర్నా రూపొందించిన టీకా విషయంలోనైతే 4 వారాల అనంతరం రెండో మోతాదు అవసరమవుతుంది. మొదటి టీకా తీసుకున్నాక ఎంతో కొంత రక్షణ లభించటం నిజమే కావొచ్చు గానీ రెండో మోతాదు తీసుకున్నాకే పూర్తి భరోసాతో ఉండొచ్చు. అంతేకాదు.. ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఇన్‌ఫెక్షన్‌ రాకుండా పూర్తిగా కాపాడతాయా? కేవలం లక్షణాలు తగ్గటానికే తోడ్పడతాయా? అన్నది ప్రస్తుతానికి తెలియదు. అంటే టీకా తీసుకున్నా కూడా ఇన్‌ఫెక్షన్‌ బారినపడే అవకాశముందనే అర్థం. ఒకింత తక్కువ స్థాయిలోనే అయినా వైరస్‌ను ఇతరులకు వ్యాపింపజేసే ప్రమాదముందని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ టీకా నిపుణుడు డెబోరా ఫుల్లర్‌ హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ టీకా పంపిణీ మొదలైనా కోట్లాది టీకాలను సరఫరా చేయటానికి నెలలు పడుతుంది. మరోవైపు- పిల్లలపై కొవిడ్‌-19 టీకా ప్రయోగ పరీక్షలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. ఇవి సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడైతే గానీ పిల్లలకు ఇవ్వటం సాధ్యం కాదని ఫుల్లర్‌ పేర్కొంటున్నారు. కాబట్టి టీకాతో గానీ సహజంగా గానీ ఎక్కువమంది సామూహిక రోగనిరోధకశక్తిని సంతరించుకునేంతవరకు మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు పాటించటం తప్పదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Even if vaccinated .. the mask is a must."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0