Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Loan SBI Reduces Interest Rates

Home Loan వడ్డీ రేట్లు తగ్గించిన SBI

Home Loan SBI Reduces Interest Rates

 ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) శుభావార్త అందజేసింది. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 6.70 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం కానున్నట్లు పేర్కొంది. మహిళా రుణ గ్రహీతలకు మరో ఐదు బేసిస్‌ పాయింట్ల వరకు రాయితీని ఇవ్వనున్నట్లు తెలిపింది. ఖాతాదారులు యోనో యాప్‌ నుంచి గృహరుణాలను పొందవచ్చునని.. అలా తీసుకున్న వారికి మరో 5 బేసిస్‌ పాయింట్ల వరకు వడ్డీరేటును తగ్గిస్తామని తెలిపింది. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. 


SBI గృహ రుణ వడ్డీ రేట్లు రూ.30 లక్షలకు 6.70 శాతం, 

రూ.30 లక్షలు నుంచి రూ.75 లక్షల వరకు 6.95 శాతం, 

రూ.75 లక్షలకుపైగా రుణాలను తీసుకునే వారికి 7.05 శాతం వద్ద గృహ రుణాలు లభిస్తాయని బ్యాంక్ ప్రకటించింది. 

బ్యాంకు గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్ల మైలు రాయిని ఫిబ్రవరిలోనే చేరిందని.. దీన్ని రానున్న ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లకు చేర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.7లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Loan SBI Reduces Interest Rates"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0