Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Fix prices for Kovid treatment in private hospitals .. AP government issues orders

 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలను ఫిక్స్ .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్ ..

Fix prices for Kovid treatment in private hospitals .. AP government issues orders ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లు, ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స ధరలను ఖరారు చేస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ క్రమంలోనే ఎన్ఏబీహెచ్ అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులకు ఒక ధర, అక్రిడేషన్ లేని హాస్పిటల్స్ కు మరో ధరను నిర్ణయించింది.

NABH అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నం క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) కోసం రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రులు రూ. 3600 వసూలు చేయాలని ఆదేశించింది. కాగా, NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రులు, లేని ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స రేట్లు ఇలా ఉన్నాయి…

NABH అక్రిడేషన్ ఉన్న ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు).

  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 4000
  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 6500
  • ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 12,000
  • క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 16,000

అక్రిడేషన్ లేని ఆసుపత్రుల్లో రేట్లు ఇలా(రోజుకు)…

  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) – రూ. 3600
  • నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ తో) – రూ. 5850
  • ఐసీయూలో చికిత్స అందిస్తే – రూ. 10,800
  • క్రిటికల్ కేర్ (ఐసీయూ + వెంటిలేటర్) – రూ. 14,400

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల్లోనే అన్ని ఫీజులు ఉంటాయని.. ఆసుపత్రులు కోవిడ్ రోగులను వెంటనే చేర్చుకోవాలని తెలిపింది. అలాగే కరోనా బాధితుల నుంచి ఎలాంటి అడ్వాన్స్ లు తీసుకోకూడదని స్పష్టం చేసింది. అటు సీటీ స్కాన్ కు రూ. 3 వేలు, రెమెడిసివిర్ ఇంజెక్షన్ వైల్ కు రూ. 2,500, టాక్లిజూమబ్ కు రూ. 30 వేలు మాత్రమే వసూలు చేయాలని సూచించింది. కాగా, ఈ ధరల పట్టికను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రదర్శించాలని ఏపీ సర్కార్ వెల్లడించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Fix prices for Kovid treatment in private hospitals .. AP government issues orders "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0