Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kovid patients must be given beds: CM Jagan‌

కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి: సీఎం జగన్‌

Kovid patients must be given beds: CM Jagan‌

  • కోవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష
  • ఆరోగ్యశ్రీ కింద కోవిడ్‌ పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు: సీఎం జగన్‌
  • కోవిడ్‌ ఆస్పత్రుల వద్దనే కోవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్న సీఎం

 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో కోవిడ్‌ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని, ఎంప్యానెల్‌ చేసిన ఆస్పత్రుల్లో విధిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలన్నారు. టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు ఇవ్వాలని, కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులూ ఆ బెడ్లు ఇవ్వాలని చెప్పారు. అందుకోసం ఆ ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేయాలన్నారు. కోవిడ్‌ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గురువారం క్యాంప్‌ కార్యాలయంలో కోవిడ్‌–19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

బెడ్లు మరిన్ని పెంచండి

మనం రికార్డు స్థాయిలో పరీక్షలు చేస్తున్నాము. మన రికార్డులను మనమే బద్ధలు కొడుతున్నాము. కోవిడ్‌ చికిత్స కోసం అవసరం మేరకు బెడ్ల సంఖ్య మరింత పెంచండి. ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అంత కంటే ఎక్కువ రోగులు వచ్చినా విధిగా చేర్చుకోవాలి. తాత్కాలిక ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లో కూడా 50 శాతం బెడ్లు కేటాయించాలి. కలెక్టర్లు నోటిఫై చేసిన నాన్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల్లోనూ 50 శాతం బెడ్లు ఇవ్వాలి. అందుకోసం ఆయా ఆస్పత్రులను తాత్కాలికంగా ఎంప్యానెల్‌ చేసి, వాటిలో సగం బెడ్లు మీరే కేటాయించండి. కోవిడ్‌ చికిత్స కోసం తీసుకున్న అన్ని ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా చికిత్స చేయాలి. ఇందులో ఎక్కడా తేడా రాకూడదు. ప్రభుత్వ, ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌లో ఉన్న వాటితో సహా, అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్స ఒకేలా ఉండాలి. 

బెడ్లపై స్పష్టత

ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో ఉన్న బెడ్లు ఎన్ని? వాటిలో ఎన్ని కోవిడ్‌ రోగులకు ఇస్తున్నారు? అన్నది పూర్తి క్లారిటీ ఉండాలి. దాని వల్ల ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఇస్తున్నామన్నది మనకు స్పష్టత వస్తుంది. అలా రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులలో ఎన్ని బెడ్లు కోవిడ్‌ రోగులకు ఉన్నాయన్న దానిపై మనకు పూర్తి స్పష్టత ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు అన్నింటిలో కలిపి కోవిడ్‌ రోగులకు మొత్తం ఎన్ని బెడ్లు ఉన్నాయన్నది తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల బెడ్లు. ప్రైవేటు ఆస్పత్రుల బెడ్లు. ఎన్నెన్ని అన్నదానిపై స్పష్టత వస్తుంది. 

ఉచితంగా వైద్యం

104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ వస్తే, ఆ రోగి ఉన్న ప్రాంతాన్ని బట్టి, ఆ జిల్లాకు మెసేజ్‌ వెళ్తుంది. వెంటనే కలెక్టర్, జిల్లా యంత్రాంగం స్పందించి, ఆయా ఆస్పత్రులలో రోగులను చేర్పించాలి. ఇది ప్రక్రియ. ఏ ఆస్పత్రి కూడా రోగుల నుంచి ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయకుండా చూడాలి. కోవిడ్‌ రోగులకు పూర్తిగా ఉచితంగా వైద్య సేవలు అందించాలి. 

ఆస్పత్రుల వద్దే సీసీసీ

అన్ని కోవిడ్‌ ఆస్పత్రుల వద్ద కోవిడ్‌ కేర్‌ సెంటర్లు హ్యాంగర్లు పెట్టి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆస్పత్రి వైద్యులే అక్కడ కూడా సేవలందిస్తారు. అక్కడ అన్ని వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి.

ఆస్పత్రులు–బెడ్లు

రాష్ట్రంలో ప్రస్తుతం 108 ప్రభుత్వ ఆస్పత్రులు. 349 కార్పొరేట్‌ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 47  కార్పొరేట్‌ టెంపరరీ ఎంప్యానెల్‌ ఆస్పత్రులు. 94 ప్రైవేట్‌ కేటగిరీ ఆస్పత్రులు.  ఆ విధంగా మొత్తం 598 ఆస్పత్రుల్లో 48,439 ఉండగా, వాటిలో 41,517 మంది చికిత్స పొందుతున్నారు. మరో 6922 బెడ్లు ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రులలో ఉన్న వారిలో 24,500 మంది రోగులు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు.

ఈ అయిదు తప్పనిసరి

అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో ఫుడ్‌ క్వాలిటీ, శానిటేషన్‌ బాగుండాలి. ఎక్కడా ఏ లోపం లేకుండా ఉండాలి. శానిటేషన్, క్వాలిటీ ఫుడ్, డాక్టర్ల అందుబాటు, ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, ఆక్సీజన్‌.. ఈ 5 మనకు చాలా ముఖ్యం. వైద్యులు లేకపోతే వెంటనే తాత్కాలికంగా అయినా నియామకాలు జరగాలి.

ఆక్సీజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు

ఆక్సీజన్‌ సరఫరా, నిల్వలో ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఎక్కడైనా అవసరం అయితే తగిన మరమ్మతులు చేయండి. కేంద్రం ఇంకా ఎక్కువ ఆక్సీజన్‌ సరఫరా చేసేలా కృషి చేయడంతో పాటు, ఇతర ప్రత్యామ్నాయాలు ఏమిటన్నది ఆలోచించండి.  ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి వద్ద 10 కెఎల్‌ సామర్థ్యం, ఇతర ఆస్పత్రుల వద్ద 1 కెఎల్‌ సామర్థ్యంతో ఆక్సీజన్‌ స్టోరేజీ ఉండాలి. వీలైనంత త్వరగా అవి ఏర్పాటు కావాలి. మనకు రోజుకు 500 టన్నుల ఆక్సీజన్‌ కావాలంటే, ఏం చేయాలన్నది ఆలోచించండి. సరఫరా. నిల్వ ఎలా అన్నది చూడండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kovid patients must be given beds: CM Jagan‌"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0