Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Supreme Court instructs Central Government to prepare for 'Third Wave'

 ‘థర్డ్ వేవ్'కు సిద్ధం కావాలి కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు.

Supreme Court instructs Central Government to prepare for 'Third Wave'

  • అది మరింత ప్రమాదకరమంటున్నారు
  • ఆక్సిజన్ బఫర్ స్టాక్ చేసుకునే విషయం ఆలోచించండి
  • కేంద్రానికి సుప్రీంకోర్టు సూచనలు

కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనేం దుకు సంసిద్ధంగా ఉండాలని గురువారం సుప్రీం కోర్టు పేర్కొంది. అవసరమైనంత ఆక్సిజన్ను సిద్ధం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచిం చింది. భారత్లో మూడో వేవ్ మరింత ప్రమాద కరంగా ఉండనుందని, ముఖ్యంగా పిల్లలపైనా ప్రభావాన్ని చూపనుందని నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలను ఉటంకించింది. తదుపరి ఆదేశాలు వరకు ఢిల్లీకి ఆక్సిజన్ సరఫరాను 700 మెట్రిక్ టన్నుల కన్నా తగ్గించవద్దని కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ మరణాలు చోటు చేసుకుంటున్నాయన్నది కాదనలేని వాస్తవమని వ్యాఖ్యానించింది. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి పరస్పర ఆరోపణలకు సుప్రీంకోర్టును వేదిక చేసుకోవడాన్ని అంగీ కరించబోమని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. విచారణలో కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రాహుల్ మెహ్రా లకు కోర్టుకొచ్చారు. కోర్టు ఆదేశించినప్పటికీ.. ఢిల్లీకి తగినంత ఆక్సిజన్ ను కేంద్రం సరఫరా చేయడం లేదని రాహుల్ మెహ్రా కోర్టుకు తెలి పారు. మధ్యప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రా లకు అడిగిన దానికన్నా ఎక్కువే సరఫరాచేస్తోందన్నారు. ఢిల్లీలోని 56 ప్రధాన ఆసు

పత్రుల్లో మే 4న సర్వే చేశామని, వాటి వద్ద అవ సరమైన స్థాయి కన్నా ఎక్కువే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ నిల్వ ఉందని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. ఆక్సిజన్ ట్యాంకుల అన్డింగ్కు చాలా సమయం పడుతోందన్నారు. ఢిల్లీకి 700 ఎంటీల ఆక్సిజన్ను సప్లచేయడం పైనే దృష్టి పెడితే ఇతర రాష్ట్రాల ఆక్సిజన్ డిమాండ్లను నెర వేర్చలేమని వివరించారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. 'ఒకవేళ ఢిల్లీకి 700 ఎంటీల ఆక్సిజన్ అవసరం లేదనుకుంటే, మీరు చెప్పినట్లు 490 ఎంటీల ఆక్సిజన్ సరిపోతుందనుకుంటే, మిగతా సుమారు 200 ఎంటీల ఆక్సిజన్ను బఫర్ స్టాక్ నిల్వ చేసుకోవచ్చు కదా!' అని సూచించింది. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో తగినంత ఆక్సిజన్ లేదంటూ ప్రజలు, కొన్ని పెద్ద హాస్పిటళ్లు కూడా సోషల్ మీడియాలో చెబుతుండటం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది. ఆసుపత్రులకు ఆక్సిజన్ ను సరఫరా చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైందని మెహతా వ్యాఖ్యానించారు. ఆక్సి జన్ డిమాండ్, సరఫరాలపై దేశవ్యాప్త ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆక్సిజన్ డిమాండపై కేంద్రం గ్రామీణ ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించింది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Supreme Court instructs Central Government to prepare for 'Third Wave'"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0