Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Nellore Krishnapatnam Anandayya arrested Nellore police have registered two cases against Anandayya.

 ఆనందయ్యపై రెండు కేసులు నమోదు చేసిన నెల్లూరు పోలీసులు.


 కృష్ణపట్నం ఆయుర్వేదం ఆనందయ్యను హౌస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యం

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి,జనం అధిక సంఖ్యలో గుమిగూడడానికి కారణమయ్యాడని.. కేసు నమోదు చేసి,వివరణ కోరిన జిల్లా SP.



నెల్లూరు: ఆయుర్వేద ఆనందయ్యపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. జనం ఎక్కువగా గుమిగూడారని ఆఫీస్‌కు పిలిపించి ఎస్పీ మాట్లాడారు. ఈ రోజు రాత్రికి ఐసీఎంఆర్ బృందం కృష్ణపట్నం రానుంది. అయితే ఆనందయ్య మందుకు రెండ్రోజుల్లో అనుమతులు వస్తాయని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. అనుమతులు వస్తే ఇతర రాష్ట్రాలకు కొరియర్ ఛార్జీలు భరించి.. తాము మందు పంపుతామని చెప్పారు. కృష్ణపట్నం పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు అక్కడ ఉచితంగా మందు పంపిణీ చేస్తున్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదంపై ఉన్న పట్టుతో అతను మందును కనిపెట్టారు. కరోనాకు మందు ఇస్తున్నారన్న విషయంతో జనం తండోపతండాలుగా అక్కడికి వస్తున్నారు. ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. అయితే మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. దీంతో శుక్రవారం నుంచి మళ్లీ మందు పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.

Note : ఈ వార్తని నెల్లూరు మరియు చిత్తూరు వాట్సాప్ న్యూస్ ల ఆధారం తో ఫార్వర్డ్ చేసినది , మరియు స్థానిక MLA కాకాణి గారు ఈ వార్తలు అపోహలు అని ఆయన అన్నట్టు గా వస్తున్న వార్త కూడా  వాట్సాప్ లలో తిరుగుతున్నది . ఏదేమైనా వాస్తవాలు బయటికి వచ్చే వరకు వేచి చూడవలసిన అవసరం ఉంది అని తెలియజేయుట మైనది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Nellore Krishnapatnam Anandayya arrested Nellore police have registered two cases against Anandayya."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0