Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CM Jagan's key decision on Krishnapatnam Ayurvedic medicine

 కృష్ణ పట్నం ఆయుర్వేద మందు పై CM జగన్ కీలక నిర్ణయం

CM Jagan's key decision on Krishnapatnam Ayurvedic medicine

Krishnapatnam: ఆయుర్వేద వైద్యంపై జగన్‌ కీలక నిర్ణయం 

  • ఆయుర్వేద మందు అధ్యయనానికి సీఎం జగన్‌ ఆదేశం
  • నెల్లూరుకు ఐసీఎంఆర్‌ బృందం
  • ఆయుర్వేద మందు అధ్యయనానికి ఐసీఎంఆర్‌ బృందం
  • ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని సీఎం జగన్‌ ఆదేశం
  • కరోనా కట్టడి చర్యలపై సీఎం సమీక్ష

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద ఔషధంపై సీఎం జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆనందయ్య ఆయుర్వేద మందు అధ్యయనానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. నెల్లూరు ఆయుర్వేదంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని అధికారులను ఆయన ఆదేశించారు ఆ ఔషధంపై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కొవిడ్‌పై నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సీఎం జగన్‌ ఆదేశాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.

నేటి నుంచి ఆయుర్వేద మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వచ్చారు. దీంతో సుమారు 3కి.మీ మేరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు తొలుత అనుమతివ్వలేదు. అనంతరం గందరగోళ పరిస్థితుల్లో పంపిణీ ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నిలిపివేశారు. ఇవాళ్టికి ఆయుర్వేద మందు పంపిణీ నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CM Jagan's key decision on Krishnapatnam Ayurvedic medicine"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0