Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Save the lives of teacher-affected teacher families.

 కరోనా బారిన పడిన ఉపాధ్యాయ కుటుంబాల ప్రాణాలు రక్షించండి.

Save the lives of teacher-affected teacher families.

  • అత్యవసర వినియోగానికి ఆక్సిజన్ కొనుగోలుకై ఏపీటీఎఫ్ విరాళాల సేకరణ 
  • విశాఖ జిల్లాలో కరోనా బారిన పడి 55 మంది ఉపాధ్యాయులు మృతి 
  • అతి స్వల్ప వ్యవధిలో 25 లక్షల విరాళం అందజేసిన ఉపాధ్యాయులు 

కోవిడ్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఉపాధ్యాయ కుటుంబాలను రక్షించేందుకు చేతనైన సహాయం చేయాల్సిందిగా ఏపీటీఎఫ్ విశాఖ జిల్లా శాఖ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన లభించింది . అతి స్వల్ప వ్యవధిలో ఇరవై ఐదు లక్షల రూపాయలను ఉపాధ్యాయులు విరాళంగా అందజేయడం విశేషం . విశాఖ జిల్లాలో ఇప్పటివరకూ కరోనా బారిన పడి ప్రస్తుతం ఉద్యోగ సర్వీస్లో ఉన్న 55 మంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు . మృతుల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది . అయితే వీరిలో అధిక శాతం మంది సకాలంలో వైద్య సేవలు అందక అత్యవసరమైన ఆక్సిజన్ అందుబాటులో లేక మృతి చెందిన వారే అధికం . దాంతో విశాఖ జిల్లాకు చెందిన ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు వెంకటపతిరాజు సూచన మేరకు ఏపీటీఎఫ్ జిల్లా సంఘం అత్యవసర వినియోగానికి అవసరమైన ఆక్సిజన్ కొనుగోలుకు విరాళాలు అందజేయాల్సిందిగా తోటి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చింది . దాంతో అనూహ్య రీతిలో అతి స్వల్ప వ్యవధిలో జిల్లాకు చెందిన ఉ పాధ్యాయులు ఇరవై ఐదు లక్షల రూపాయలకు పైగా విరాళాలు అందజేయడం విశేషం . ఈ నిధులతో ఆక్సిజన్ కాన్సే ట్రేటర్లు కొనుగోలు చేసి బారినపడి వైద్య చికిత్సలో భాగంగా అత్యవసర ఆక్సిజన్ అవసరమైన కుటుంబాలకు వీటిని అందజేస్తామని ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు వెంకటపతిరాజు తెలిపారు . వైద్య ప్రముఖులు , సంబంధిత రంగ నిపుణుల సలహా సూచనల ప్రకారం త్వరలో ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను కొనుగోలు చేసి జిల్లాలో అందరికీ అందుబాటులో ఉండేలా సిద్ధం చేస్తున్నామన్నారు . తోటి ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలన్న సహృదయంతో విశాఖ జిల్లాలోనే కాకుండా , ఇతర ప్రాంతాలకు చెందిన వారు కూడా విరాళాలు అందజేస్తున్నారన్నారు . 

ఉపాధ్యాయుల పిల్లలైన వైద్యులతో చికిత్స సలహాలు 

కరోనా పాజిటివ్ లక్షణాలతో ఉన్న ఉపాధ్యాయ కుటుంబాలకు తోటి ఉపాధ్యాయ కుటుంబాల్లో వైద్య విద్యనభ్యసించి వైద్యులుగా స్థిరపడిన వారి నుంచి చికిత్స సలహాలు అందించే ఏర్పాటు కూడా చేశామని ఏపీటీఎఫ్ నాయకుడు ఆర్ ప్రకాశ్ రావు తెలిపారు . ఇటువంటి వైద్య ప్రముఖుల ఫోన్ నెంబర్లను , వారిని సంప్రదించాల్సిన సమయాలు ఇతర వివరాలను జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచామన్నారు . అదేవిధంగా ఉపాధ్యాయుల వద్ద చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడిన వైద్య ప్రముఖుల సేవలను కూడా కరోనా బారిన పడిన ఉపాధ్యాయులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఏపిటిఎఫ్ రాష్ట్ర నాయకుడు వెంకటపతిరాజు తెలిపారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Save the lives of teacher-affected teacher families."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0