15 days special CL for central Government employees!
కేంద్ర ఉద్యోగులకు 15 రోజుల ప్రత్యేక సీఎల్!
- తల్లిదండ్రులకు పాజిటివ్ వస్తే తీసుకోవచ్చు
- కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యులకు ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే 15 రోజుల ప్రత్యేక సాధారణ సెలవు (ఎస్‌సీఎల్)లు తీసుకోవచ్చు. ఈ మేరకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు/తల్లిదండ్రులు 15 రోజుల ప్రత్యేక సీఎల్‌లు పూర్తయిన తర్వాత కూడా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తే.. వారు డిశ్చార్జి అయ్యే వరకు ఇతర సెలవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది’’ అని తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చికిత్స, ఆస్పత్రిలో, క్వారంటైన్‌లో ఉండడంపై సమగ్ర వివరాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు కొవిడ్ పాజిటివ్ వచ్చి హోం ఐసొలేషన్/ క్వారంటైన్‌లో ఉంటే 20 రోజుల వరకు ప్రయాణ సెలవులు/ఎ్‌ససీఎల్/ఆర్జిత సెలవులు ఇస్తారు.
20 రోజులకు మంచి ఆస్పత్రిలో ఉండాల్సి వస్తే సంబంధిత ఆధారాలు చూపితే ప్రయాణ సెలవులు మంజూరు చేసా ్తరు. కొవిడ్ పాజిటివ్ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయి హోం ఐసొలేషన్‌లో ఉండాల్సి వచ్చిన ఉద్యోగులకు ఏడు రోజులు ఆన్‌డ్యూటీ/ వర్క్‌ఫ్రం హోంగా పరిగణిస్తారు. కట్టడి ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులకు ఆ ప్రాంతం మళ్లీ సాధారణ జోన్‌గా మారే వరకు ఆన్‌డ్యూటీ/వర్క్ ఫ్రం హోంగా పరిగణిస్తారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.
0 Response to "15 days special CL for central Government employees!"
Post a Comment