Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jio: New service from Jio ... Vaccine availability information on WhatsApp

 Jio : జియో నుంచి కొత్త సర్వీస్ ... వాట్సప్లో వ్యాక్సిన్ లభ్యత సమాచారం.

Jio: New service from Jio ... Vaccine availability information on WhatsApp


వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుంది? దగ్గర్లోని ఆస్పత్రిలో వ్యాక్సిన్ అందుబాటులో ఉందా? ఇలాంటి సమాచారం ఎలా తెలుసుకోవాలన్న సందేహం సామాన్యుల్లో ఉండటం మామూలే. ఈ సమాచారాన్ని వాట్సప్‌లో అందిస్తోంది. రిలయెన్స్ జియో. ఇందుకోసం వాట్సప్ ఛాట్‌బాట్‌ను ప్రారంభించింది. వన్ టైమ్ పాస్‌వర్డ్ ద్వారా వ్యాక్సిన్ లభ్యత సమాచారాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. ఏ మొబైల్ నెట్వర్క్ అయినా జియో వాట్సప్ ఛాట్‌బాట్ పనిచేస్తుంది. ఇందుకోసం యూజర్లు జియో ప్రత్యేకంగా కేటాయించిన 70007 70007 నెంబర్‌ను తమ ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే నెంబర్‌కు HI అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత జియో వాట్సప్ ద్వారా అందించే సేవల్ని పొందొచ్చు. యూజర్లు కేవలం పిన్‌కోడ్ ఎంటర్ చేయడం ద్వారా తమ ప్రాంతంలో వ్యాక్సిన్ లభ్యత సమాచారం తెలుస్తుంది.

దీంతో పాటు రీఛార్జ్ వయా వాట్సప్ పేరుతో ఈ సర్వీస్ అందిస్తోంది. అంటే జియో కస్టమర్లు ఇకపై వాట్సప్ ద్వారా రీఛార్జ్ చేయొచ్చు. ప్రస్తుతం రీఛార్జ్ చేయాలంటే మొబైల్ పాయింట్‌కు వెళ్లాలి. లేదా స్మార్ట్‌ఫోన్‌లో ఏదైనా యాప్ ద్వారా రీఛార్జ్ చేయాలి. ఇప్పుడు వాట్సప్ ద్వారా రీఛార్జ్ చేసే సర్వీస్ ప్రారంభించింది రిలయెన్స్ జియో. వాట్సప్ ద్వారా రీఛార్జ్ మాత్రమే కాదు మరిన్ని సేవల్ని కూడా అందిస్తోంది రిలయెన్స్ జియో. యూజర్లు తమ సందేహాలకు సమాధానాలు తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు చేయొచ్చు. ఇవన్నీ సేవల్ని కేవలం 70007 70007 నెంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకొని, HI అని టైప్ చేసి పంపించడం ద్వారా సాధ్యం అవుతుంది.

వాట్సప్ ద్వారా జియో ప్రధానంగా 6 రకాల సేవల్ని అందిస్తోంది. అందులో మొదటిది జియో సిమ్ రీఛార్జ్. రెండోది కొత్త జియో సిమ్ తీసుకోవడం లేదా జియోకు పోర్ట్ కావడం, జియో సిమ్ సపోర్ట్, జియో ఫైబర్ సపోర్ట్, ఇంటర్నేషనల్ రోమింగ్ సపోర్ట్, జియో మార్ట్ సపోర్ట్ లాంటి సేవలన్నింటినీ వాట్సప్ ద్వారా అందిస్తోంది జియో. కస్టమర్లకు మెరుగైన సేవల్ని అందించడం కోసం వాట్సప్‌తో ఇంటిగ్రేట్ అయింది జియో. ప్రస్తుతం వాట్సప్ గురించి ప్రతీ ఒక్కరికీ తెలుసు. స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే కాదు ఫీచర్ ఫోన్లలో కూడా వాట్సప్ యాప్ పనిచేస్తోంది. అందుకే జియో యూజర్లు తమ మొబైల్ రీఛార్జులు, జియో ఫైబర్ సేవలు, జియో మార్ట్ సేవల్ని వాట్సప్ ద్వారా పొందేందుకు సరికొత్త సర్వీస్ ప్రారంభించింది జియో. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ సేవలు లభిస్తాయి. త్వరలో ఇతర భారతీయ భాషల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jio: New service from Jio ... Vaccine availability information on WhatsApp"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0