Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar Card: These Aadhaar services do not require internet

Aadhaar Card: ఈ ఆధార్ సేవలకు ఇంటర్నెట్ అవసరం లేదు



Aadhaar Card: These Aadhaar services do not require internet

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవల్ని అందిస్తోంది. కేవలం ఎస్ఎంఎస్ పంపి సేవల్ని పొందొచ్చు. ఎలాగో తెలుసుకోగలరు.

ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవల్ని పొందాలనుకుంటే ఆధార్ కార్డ్ హోల్డర్లు 1947 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాలి. వేర్వేరు సేవలకు వేర్వేరు ఫార్మాట్లలో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఎస్ఎంఎస్ ద్వారా వర్చువల్ ఐడీ జనరేట్ చేయొచ్చు. రిట్రీవల్ చేయొచ్చు. ఆధార్ నెంబర్ లాక్ చేయొచ్చు లేదా అన్‌లాక్ చేయొచ్చు. బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయొచ్చు. ఇలా ప్రతీ సేవకు యూఐడీఏఐ సూచించిన ఫార్మాట్‌లో ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ ఆధార్ నెంబర్ 1234-5678-9123 అనుకుంటే ఎస్ఎంఎస్ ఎలా పంపాలో తెలుసుకోగలరు.

వర్చువల్ ఐడీ జనరేట్ చేయడానికి GVID అని టైప్ చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెల్ని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. అంటే GVID 9123 అని టైప్ చేయాలి. వర్చువల్ ఐడీని రీట్రీవ్ చేయడానికి RVID 9123 అని టైప్ చేయాలి. ఇక వన్ టైమ్ పాస్‌వర్డ్ పొందడానికి GETOTP అని టైప్ చేసి చివరి నాలుగు అంకెలు టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు GETOTP 9123 అని టైప్ చేయాలి.

మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయడానికి ముందుగా GETOTP 9123 అని టైప్ చేసి పంపాలి. ఆ తర్వాత LOCKUID 9123 అని టైప్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ అన్‌లాక్ చేయడానికి కూడా ఇదే ప్రాసెస్ ఫాలో కావాలి. UNLOCKUID అని టైప్ చేయాల్సి ఉంటుంది.

ఇక బయోమెట్రిక్ లాక్‌ను ఎనేబుల్ చేయడానికి ముందుగా పైన చెప్పిన ఫార్మాట్‌లో ఓటీపీ జెనరేట్ చేయాలి. ఆ తర్వాత ENABLEBIOLOCK 9123 టైప్ చేసి ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.బయోమెట్రిక్ లాక్ డిసేబుల్ చేయడానికి ఎస్ఎంఎస్‌లో DISABLEBIOLOCK అని టైప్ చేయాలి. ఇక బయోమెట్రిక్స్‌ని తాత్కాలికంగా అన్‌లాక్ చేయడానికి కూడా ఓటీపీ జనరేట్ చేయాలి. UNLOCKBIO 9123 అని టైప్ చేసి ఓటీపీ టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపాలి.

ఒకవేళ ఆధార్ నెంబర్ బదులు వర్చువల్ ఐడీ ఉపయోగిస్తున్నట్టైతే ఐడీలోని చివరి 6 అంకెల్ని టైప్ చేయాలి. ఒకే ఫోన్ నెంబర్‌కు ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ నెంబర్లు లింక్ అయితే ఆధార్ నెంబర్‌లోని చివరి 8 అంకెల్ని టైప్ చేయాలన్న విషయం గుర్తుంచుకోండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Aadhaar Card: These Aadhaar services do not require internet"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0