Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

EPF Withdrawal: You can find out how much can be drawn from an EPF account.

 EPF Withdrawal: ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోగలరు.

EPF Withdrawal: You can find out how much can be drawn from an EPF account.

EPF Withdrawal ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డబ్బులకు ఇబ్బందిగా ఉందా? ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా? ఏ కారణంతో ఎంత డ్రా చేయొచ్చో తెలుసుకోగలరు.

1. కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గతేడాది కరోనా వైరస్ ఆర్థిక సంక్షోభం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఇలాంటి కష్టకాలంలో ఆదుకునేవి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌లోని డబ్బులే. ఇదేకాదు... ఆర్థికంగా భారీ మొత్తంలో ఏ అవసరం వచ్చినా అందరూ పీఎఫ్ డబ్బుల వైపే చూస్తారు. 

2. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO కూడా ఈపీఎఫ్ ఖాతాదారులకు పాక్షికంగా డబ్బులు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి మాత్రమే కాదు పెళ్లి, పిల్లల చదువులు, స్థిరాస్తి కొనుగోలు, హోమ్ లోన్ రీపేమెంట్, వైద్య అవసరాల కోసం ఈపీఎఫ్ అకౌంట్ నుంచి పాక్షికంగా డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరి ఏ కారణంతో ఎంత డ్రా చేసుకోవచ్చో తెలుసుకోండి. 

3. Covid 19: కరోనా వైరస్ మహమ్మారి కారణంతో ఉద్యోగులు ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుంచి తమ మూడు నెలల వేతనం, వేతనం+డీఏ లేదా మొత్తం బ్యాలెన్స్‌లో 75 శాతం వరకు డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారందరికీ ఇది వర్తిస్తుంది. 

4. Marriage: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ పెళ్లికి లేదా సోదరి, సోదరుడు, కూతురు, కొడుకు పెళ్లి కోసం ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంప్లాయీస్ షేర్ నుంచి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 7 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుంది. 

5. Education: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్స్ తమ చదువులు లేదా పిల్లల పైచదువుల కోసం ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంప్లాయీస్ షేర్ నుంచి 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 7 ఏళ్ల సర్వీస్ ఉన్నవారికి ఈ అవకాశం ఉంటుంది.

6. Land or House: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ భూమి కొనుగోలు చేయాలనుకుంటే తమ వేతనం+డీఏకు 24 రెట్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ స్థలం తన పేరు మీద లేదా జీవిత భాగస్వామి పేరు మీద లేదా జాయింట్‌గా ఉండాలి. ఇక ఇల్లు కొనాలనుకుంటే 36 రెట్లు విత్‌డ్రా చేయొచ్చు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తైనవారికి ఇది వర్తిస్తుంది. మొత్తం సర్వీస్‌లో ఈ కారణంతో ఒకేసారి విత్‌డ్రా చేయొచ్చు. 

7. Home Loan Repayment: హోమ్ లోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ అకౌంట్‌లో ఎంప్లాయీస్, ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేయొచ్చు. మూడేళ్ల సర్వీస్ పూర్తైనవారికి ఈ అవకాశం ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఈపీఎఫ్ఓకు సమర్పించాలి. 

8. Renovation of House: ఈపీఎఫ్ ఖాతాదారులు తమ ఇంటిని పునర్నించడానికి ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఐదేళ్ల సర్వీస్ పూర్తైనవారికి ఇది వర్తిస్తుంది. ఆ ఇల్లు తన పేరు మీద లేదా జీవిత భాగస్వామి పేరు మీద లేదా జాయింట్‌గా ఉండాలి.

9. Before Retirement: ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ 57 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఈపీఎఫ్ ఖాతాలోని మొత్తంలో 90 శాతం వరకు వడ్డీతో సహా విత్‌డ్రా చేసుకోవచ్చు. 

10. Medical: ఈపీఎఫ్ ఖాతాదారులు తమకు లేదా జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రుల వైద్య అవసరాల కోసం రూ.1,00,000 వరకు డ్రా చేసుకోవచ్చు. ఇటీవలే నిబంధనల్ని మార్చింది ఈపీఎఫ్ఓ. 

11. Retirement: ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ వయస్సు 58 ఏళ్లు దాటితే అప్పటి వరకు ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "EPF Withdrawal: You can find out how much can be drawn from an EPF account."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0