Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Andhra Pradesh: Another 7,000 posts to be filled in the health department!

 Andhra Pradesh : ఆరోగ్య శాఖలో మరో 7,000 పోస్టుల భర్తీ !

Andhra Pradesh: Another 7,000 posts to be filled in the health department!

  • భారీగా నియామకాలకు కసరత్తు
  • అన్ని వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌
  • గత ఏడాదిలో 2,920 పోస్టుల భర్తీ
  • ఆరోగ్య మిషన్‌ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ ద్వారా మిగతా నియామకాలు పూర్తి
  • ప్రతి వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లో అందుబాటులో 12 రకాల సేవలు

 గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలను బలోపేతం చేయడంలో భాగంగా మరో 7,000 పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌ లెవల్‌ హెల్త్‌ప్రొవైడర్స్‌) నియామకాలు చేపట్టనున్నారు.

ఇప్పటికే 2,920 మంది నియామకాలు పూర్తి కాగా జాతీయ ఆరోగ్యమిషన్‌ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ ఇచ్చి మెరిట్‌ ప్రాతిపదికన మిగతా నియామకాలు చేపట్టనున్నారు. తద్వారా ఇకపై ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు ఉంటారు.

దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందుతాయి. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యశాఖ గత రెండేళ్లుగా 9,500కిపైగా శాశ్వత నియామకాలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉండేలా నియామకాలు పూర్తి చేశారు. వేలాది మంది స్టాఫ్‌ నర్సులను నియమించారు.

గత ఏడాది ఎంఎల్‌హెచ్‌పీల నియామకం ఇలా

  1. జిల్లా సంఖ్య
  2. శ్రీకాకుళం 173
  3. విజయనగరం 187
  4. విశాఖపట్నం 247
  5. తూ.గోదావరి 274
  6. ప.గోదావరి 248
  7. కష్ణా 237
  8. గుంటూరు 284
  9. ప్రకాశం 204
  10. నెల్లూరు 166
  11. చిత్తూరు 268
  12. కడప 172
  13. అనంతపురం 241
  14. కర్నూలు 219

ప్రతి క్లినిక్‌లో సిబ్బంది, మందులు
'ఈ ఏడాది చివరి నాటికి 10,032 వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి కేంద్రంలో ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎఎన్‌ఎం ఉండేలా చర్యలు చేపడతాం. ప్రతి క్లినిక్‌లో మందులు అందుబాబులో ఉంటాయి. ప్రాథమిక వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. త్వరలోనే నియామకాల ప్రక్రియ చేపడతాం'
-కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమశాఖ

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో 12 రకాల సేవలు ఇవీ..

  • గర్భిణులు, నవజాత శిశువుల ఆరోగ్య పరిరక్షణ
  • నవజాత, ఏడాది లోపు శిశువుల సంరక్షణ
  • ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు యుక్తవయసు వారికి ఆరోగ్య సేవలు
  • కుటుంబ నియంత్రణ, బిడ్డకు బిడ్డకు మధ్య ఎడం ఉండేలా ఆయా పద్ధతులపై అవగాహన
  • సాంక్రమిక వ్యాధులపై అవగాహన
  • సాధారణ జ్వరాలు, తదితరాలపై ప్రజలకు వైద్య సేవలు
  • మధుమేహం, బీపీ లాంటివి ప్రాథమిక దశలో గుర్తించేలా స్క్రీనింగ్‌
  • కన్ను, చెవి ముక్కు గొంతుæ సమస్యలు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం
  • దంత సమస్యలకు సేవలు అందించడం
  • 60 ఏళ్లు దాటిన వారికి పాలియేటివ్‌ కేర్‌ (నొప్పి నివారణ) మందులు ఇవ్వడం
  • అత్యవసర చికిత్సల్లో భాగంగా మెడికల్‌ కేర్‌పై జాగ్రత్తలు
  • మానసిక జబ్బు లక్షణాలుంటే గుర్తించి పీహెచ్‌సీ, సీహెచ్‌సీలకు రిఫర్‌ చేయడం


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Andhra Pradesh: Another 7,000 posts to be filled in the health department!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0