Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Problems with the new education system

కొత్తగా చిక్కులొచ్చేనా..?

Problems with the new education system

  • నూతన విద్యా విధానంతో సమస్యలు
  • 3, 4, 5 తరగతుల తరలింపుతో విద్యార్థులకు దూరాభారం
  • వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌తో ఎస్జీటీలకూ ఇక్కట్లే
  • సరిపడా తరగతి గదులు..భవనాల నిర్మాణం సాధ్యమేనా..?

   పాఠశాల, సెకండరీ విద్యలో పలు సంస్కరణల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యారంగంలో సమూల మార్పు లతో పాటే పలు సమస్యలు కూడా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక, ప్రాఽథమిక, సెకండరీ విద్యా విధానంతో నూతన విద్యావిధానాన్ని ప్రవేశ పెట్టేందుకు ప్రతి పాదిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇవి అమలైతే ప్రాథమిక విద్య బలోపేతం అవుతుండగా, 3 నుంచి 12 తరగతులతో ఏర్పాటయ్యే సెకండరీ స్కూళ్ల వల్ల ముఖ్యంగా ప్రాఽథమిక పాఠశాలల నుంచి హైస్కూళ్ళకు విలీనం అయ్యే 3, 4, 5 తరగతుల విద్యార్థులు దూరాభారం కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు దూరమవుతారన్న అభిప్రాయాలు నెలకొ న్నాయి. దీంతోపాటు పలు క్షేత్రస్థాయి సమస్యలు, టీచర్ల నుంచి అభ్యంతరాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.  

నూతన విద్యా విధానం ఇలా..

నూతన విద్యా విధానం ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు గల చిన్నారులకు బోధించే ప్రీ ప్రైమరీ–1, 2(నర్సరీ, ఎల్‌కెజీ, యూకెజీ)లకు అదనంగా ప్రిపరేటరీ–1 విద్యను ప్రారంభించి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేస్తారు. దీంతో జిల్లాలోని 3,889 అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసించే 75,660 మంది చిన్నారులు, అంగన్‌వాడీ కేంద్రాలతో సహా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం అవుతాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్ళుగా పిలుస్తారు. అవసరం ఉన్నచోట అంగన్‌వాడీ కేంద్రాలను యధాస్థానంలోనే కొనసాగిస్తారు. ఆ ప్రకారం పీపీ–1, 2, ప్రిపరేటరీ–1, ఒకటి, రెండో తరగతులు ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలల్లో ఉంటాయి. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రాఽథమిక పాఠశాలల్లో ఉన్న 1–5 తరగతుల నుంచి 3,4,5 తరగతులను విడదీసి విద్యార్థులతో సహా సమీప ప్రాఽథమికోన్నత (యూపీ) లేదా హైస్కూళ్ళకు తరలిస్తారు. ఇలా హైస్కూళ్ళకు 3, 4, 5 తరగ తులను తరలించడం ద్వారా జిల్లాలో సంబంధిత తరగతులు చదువుతున్న 88 వేల 947 మంది బాల బాలికలు యూపీ లేదా హైస్కూళ్ళకు  వెళ్ళాల్సి ఉంటుంది. యూపీ పాఠశాలల కొనసాగింపు లేదా రద్దుపై స్పష్టతలేదు. ఒకవేళ యూపీ పాఠశాలల్లోకి 3, 4, 5 తరగతులను తరలించాల్సి వస్తే జిల్లాలోని 252 ప్రాఽథమికోన్నత పాఠశాలల్లో కొన్ని పాఠశాలలు అవసరం ఉన్న చోట కొనసాగుతాయి.

సమస్యలకు అవకాశం ఇలా ..

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను హైస్కూళ్ళల్లోకి విలీనం చేయడం వలన ఇక మీదట సంబంధిత తరగతులు చదివే చిన్నారులంతా గరిష్టంగా మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించి తరగతులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇప్పటివరకు స్థానికంగానే ఐదవ తరగతి వరకు ఆడుతూపాడుతూ చదివిన పిల్లలు రోజూ మూడు కిలోమీటర్ల వరకు రాకపోకలు సాగించాలంటే కష్టమే. కుటుంబ సభ్యుల్లో నిత్యం ఎవరో ఒకరు పిల్లలను తీసుకువెళ్ళి తీసుకురావాల్సి ఉంటుంది. అలా కాకుండా సైకిళ్ళపై పిల్లలు వెళ్ళాలన్నా చిన్న వయసు కావడంతో ఇబ్బందులే. అంతిమంగా 3, 4, 5 తరగతుల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సమీపంగా ఉండే ప్రైవేటు పాఠశాలల వైపు వెళ్లిపోయే అవకాశాలున్నాయి.

ప్రీప్రైమరీ, ఫౌండేషన్‌ స్కూళ్ళల్లో పిపి–1, 2, ప్రిపరేటరి–1 తరగతులకు అంగన్‌వాడీ టీచర్లు, వలంటీర్లు, ఒకటి, రెండు తరగతులకు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) ఉంటారు. నూతన విధానంలో వీరిద్దరి మధ్య సమన్వయ లోపానికి అవకాశాలు ఉన్నాయి.విధులు, జీతభత్యాల విషయంలోనూ సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉండవచ్చు. ప్రధానంగా ఇప్ప టివరకు జిల్లాలోని ప్రాఽథమిక పాఠశాలల్లో మెజార్టీ స్కూళ్లన్నీ ఒకరు, లేదా ఇద్దరు ఎస్జీటీలతోనే నడుస్తున్నాయి.ఆ మేరకు టీచర్లు, వలంటీర్లను తప్పనిసరిగా సరిపడా సంఖ్యలో నియమిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి.

 హైస్కూళ్ళల్లోకి 3, 4, 5 తరగతులు విలీనం చేస్తుండడం వల్ల సంబంధిత తరగతులు బోధించే ఎస్జీటీలందరూ ఇక మీదట గెజిటెడ్‌ హోదా కలిగిన గ్రేడ్‌–2 హెచ్‌ఎం నియం త్రణలో పనిచేయాల్సి ఉంటుంది. తరగతుల వారీగా విద్యార్థుల సంఖ్యను బట్టి ప్రాఽథమిక పాఠశాలలోని ఎస్జీటీల నుంచి సీని యర్లను హైస్కూళ్ళకు, జూనియర్‌ లను ఫౌండేషన్‌ స్కూళ్ళకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇలా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌తోపాటే సంబంధిత పోస్టులను కూడా విలీనం చేసి హైస్కూళ్ళకు తరలించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో రాజకీయ జోక్యం, సిఫార్సులతో పారదర్శకంగా పూర్తి చేయడం ఒక ప్రహసనంగానే చెప్పవచ్చు.

3,4, 5 తరగతులతో పాటు ఎంపిక చేసిన హైస్కూళ్ళల్లో రెండేళ్ల ఇంటర్‌ విద్యను కూడా బోధించడానికి అవసరమైనన్ని తరగతి గదులు, భవనాలు, మౌలిక వసతులు నిర్మించాల్సి ఉంటుంది. నూతన నిర్మాణాలు ఇప్పటికిప్పుడు చేపట్టడం, పూర్తిచేయడం వంటివి అంత సులువుకాదు. ఎందుకంటే ఏడాదిన్నర క్రితం జిల్లాలో మొదలుపెట్టిన నాడు–నేడు కార్యక్రమం నిర్మాణ పనులే ఇప్పటికీ నూరు శాతం పూర్తికాక కొనసాగుతున్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Problems with the new education system"

Post a Comment