Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona Vaccination: Corona Vaccination, Myths - Facts .. Full Details

 Corona Vaccination : కరోనా టీకాలు , అపోహలు -వాస్తవాలు .. పూర్తి వివరాలు

Corona Vaccination: Corona Vaccination, Myths - Facts .. Full Details

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమంలో అనేక అపోహలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ల కొరత, ఆయా రాష్ట్రాలకు సరఫరా చేయడం, టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ లాంటి విషయాల్లో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై ఉన్న అపోహలు, వాస్తవాలేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిపై ఏపీ కోవిడ్-19 స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ పలు వివరణలు ఇచ్చారు

1) అపోహ:
కరోనా టీకా తీసుకోవాలంటే తప్పనిసరిగా ముందే ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి అలాగే ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని ఉండాలి.

వాస్తవం:
అలా ఏం కాదు. కరోనా టీకా టీసుకోవాడానికి ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. 18ఏళ్లు నిండినవారు అంతకంటే ఎక్కువ వయసువారు నేరుగా దగ్గర్లో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్లకు వెళ్లవచ్చు. అక్కడికక్కడే అధికారులు టీకాల లభ్యతను బట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి వ్యాక్సిన్ ఇస్తారు.

2)అపోహ:
గ్రామీణ ప్రాంతాల్లో కరోనా టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్నాయి. దాన్ని సులభతరం చేయాలి?
వాస్తవం:
గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియలు అనేక రకాలుగా ఉన్నాయి. కోవిన్, హెల్త్ వర్కర్లు, ఆశా వర్కర్లు కూడా అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ చేస్తారు. 1075 హెల్ప్ లైన్ కు కాల్ చేసి అయినా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వారు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లను ఎంపిక చేసి రిజిస్ట్రేషన్ చేస్తారు.

3)అపోహ:
వ్యాక్సినేషన్ ప్రక్రియలో గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది.
వాస్తవం:
మొత్తం 1.03 లక్షల కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు (సీవీసీలు), ఎస్.హెచ్.సి, పీహెచ్.సి, సీహెచ్.సిలు (59.7శాతం) గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఈ కేంద్రాల్లోనే 01-05-2021 నుంచి 21-06-2021 నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని టీకా పొందే అవకాశం కల్పించారు.
కొవిన్ పోర్టల్ లో మొత్తం 69,995 వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో 71శాతం ( 49,883) వ్యాక్సిన్ సెంటర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.

4)అపోహ:
గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ తక్కువ స్థాయిలో జరుగుతోంది.

వాస్తవం:
జూన్ 3వ తేదీవరకు అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం గిరిజన ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రకియ పరిస్థితి ఇలా ఉంది:
1. గిరిజన జిల్లాలలో ప్రతి పదిలక్షల జనాభాలో టీకాలు వెసుకున్నవారి సంఖ్య జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది.
2. 176 గిరిజిన జిల్లాలకు గాను 128 జిల్లాలో టీకాల పరిస్థితి దేశంలోని ఇతర వ్యాక్సినేషన్ కేంద్రాల కంటే బాగానే ఉంది.
3. అంతేకాకుండా నేరుగా టీకా కేంద్రానికే వచ్చి టీకా వేయించుకున్నవారిలో మిగతావారి కంటే సగటున గిరిజనులే ఎక్కువగా ఉన్నారు.

5)అపోహ:
ఇటీవల కొన్ని మీడియా సంస్థలలో టీకాలు వేసిన తరువాత కరోనా రోగుల మరణాల సంఖ్య పెరిగిందన్న ప్రచారం అపోహ.

వాస్తవం:
అసమగ్రమైన సమాచారంతోపాటు సరిగ్గా అర్థం చేసుకోని కారణంగా ఇలాంటి ప్రచారం జరుగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణం సంభవిస్తే అధి వ్యాక్సిన్ నేషన్ వల్ల జరిగిందని చెప్పలేమని.. ఏఈఎఫ్ఐ కమిటీ విచారణ అనంతరమే దాన్ని నిర్ధారించగలము.

6)అపోహ:
జనవరి 16, 2021 నుంచి జూన్ 7, 2021 వరకు 488 మంది కోవిడ్ నుంచి కోలుకుని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించారని కొన్ని మీడియా రిపోర్టులు ప్రచారంలో ఉన్నాయి.

వాస్తవం:
దేశ వ్యాప్తంగా 23.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ఇందులో 0.0002శాతం మాత్రమే మరణాలు ఉన్నట్టు గుర్తించారు. మరణాలు 1శాతం మరియు వ్యాక్సినేషన్ ద్వారా మరణాల సంఖ్య కూడా తగ్గుతుంది. కోవిడ్19కు వ్యాక్సిన్ తీసుకోవడంతో నిర్లక్ష్యంగా ఉంటే చనిపోవడానికి ఎక్కువ రిస్కు ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona Vaccination: Corona Vaccination, Myths - Facts .. Full Details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0