Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Delta Variant: The risk of the Delta variant is higher for those who have not been vaccinated, WHO

 Delta Variant : వ్యాక్సిన్ తీసుకోని వారికే డెల్టా వేరియంట్ ముప్పు ఎక్కువ , WHO

Delta Variant: The risk of the Delta variant is higher for those who have not been vaccinated, WHO

Delta Variant : ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారికి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. టీకాలు తీసుకోని వారే ఎక్కువగా కరోనా వైరస్ డెల్టా వేరియంట్ బారినపడుతున్నట్టు డబ్ల్యూహెచ్ వో తెలిపింది. కరోనా వైరస్‌లో ఎన్నో రకాలు పుట్టినప్పటికీ వాటన్నింటికంటే డెల్టా వేరియంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని ఆ సంస్థ చీఫ్ టెడ్రస్ అధనోమ్ తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన అన్ని వేరియంట్ల కంటే ఇదే అత్యంత వేగంగా వ్యాప్తిస్తోందని తెలిపారు. దాదాపు 85 దేశాల్లో ఈ వేరియంట్ బయటపడిందన్నారు. కరోనా వ్యాక్సిన్లు వేసుకోని వారిలో ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు.

కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో చాలా దేశాలు ఇటీవల కరోనా నిబంధనలు సడలిస్తున్నాయి.

దీంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అధనోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ మరింతగా రూపాంతరం చెందే అవకాశం ఉందని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం ద్వారా కొత్త వేరియంట్లు రాకుండా నిరోధించవచ్చన్నారు.

ఆల్ఫా వేరియంట్ తర్వాత డెల్టా వేరియంటే అత్యంత ప్రమాదకరమని డబ్ల్యూహెచ్ఓ కొవిడ్ టెక్నికల్ హెడ్ డాక్టర్ మరియా వాన్ తెలిపారు. వ్యాక్సిన్ వేసుకోని వారికి దీని నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుందన్నారు. వేరియంట్ ఏదైనా దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని మరియా వివరించారు.

వ్యాక్సిన్లు తీసుకున్నా మాస్కులు మస్ట్ అంటోంది డబ్ల్యూహెచ్ వో. పూర్తిస్థాయిలో టీకాలు పొందిన వారు కూడా మాస్కులు ధరించడం, ఇతర కొవిడ్‌ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని తేల్చి చెప్పింది. డెల్టా రకం విజృంభణ నేపథ్యంలో ఇలాంటి చర్యలు మరింత అవసరం అంది. టీకా రెండు డోసులు పొందినవారు నిబంధనలను పాటించకపోతే ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తికి కారకులవుతారని హెచ్చరించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Delta Variant: The risk of the Delta variant is higher for those who have not been vaccinated, WHO"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0