Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Does the electricity bill get higher every month? Following these tips can reduce your electricity bill.

 నెల నెలా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందా? ఈ సూచనలు పాటిస్తే విద్యుత్ బిల్లును తగ్గించుకోవచ్చు.

Does the electricity bill get higher every month?  Following these tips can reduce your electricity bill.

కరెంటును ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. లేదంటే బిల్లు వాచిపోతుంది. ఒక లిమిట్ వరకు ఓకే. కానీ లిమిట్ దాటి స్లాబులు మారేకొద్దీ యూనిట్ విద్యుత్ చార్జిలు కూడా పెరిగిపోతాయి. దీంతో బిల్లు తడిసి మోపెడవుతుంది. కనుక కరెంటును పొదుపుగా వాడితే అధిక మొత్తంలో బిల్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ క్రమంలోనే కింద తెలిపిన పలు సూచనలను పాటించడం వల్ల నెల నెలా మీకు వచ్చే విద్యుత్ బిల్లును గణనీయంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటంటే..

బిల్లును తగ్గించుకొనే విధానం

  • 1. కొందరు ఇప్పటికీ ఇళ్లలో పాత సీఎఫ్ఎల్ బల్బులు, ట్యూబ్ లైట్లను వాడుతున్నారు. వాటికి బదులుగా ఎల్ఈడీ బల్బులను వాడితే ఎంతో విద్యుత్ ఆదా అవుతుంది.
  • దీంతో బిల్లు తక్కువ వస్తుంది.
  • 2. ఫ్రిడ్జిలు, ఏసీలు తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు వాటికి ఉండే పవర్ కన్‌జమ్‌షన్ రేటింగ్‌ను బట్టి వాటిని కొనాలి. ఎక్కువ రేటింగ్ ఉంటే ఎక్కువ విద్యుత్‌ను ఆదా చేయవచ్చు. దీంతో బిల్లు అధికంగా రాకుండా జాగ్రత్త పడవచ్చు.
  • 3. కొందరు ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు వంటి విద్యుత్ ఉపకరణాలను వాడాక అలాగే ఆన్ లో ఉంచుతారు. దీని వల్ల బిల్లు అధికంగా వస్తుంది. కనుక ఆయా ఉపకరణాలు వినియోగంలో లేని సమయంలో వాటిని ఆఫ్ చేసి ఉంచాలి. దీంతో అధిక బిల్లు రాకుండా చూసుకోవచ్చు.
  • 4. ఏసీలను కొందరు మరీ తక్కువ ఉష్ణోగ్రత 17 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేసి రన్ చేస్తుంటారు. ఇలా చేయరాదు. వాటిని 24 డిగ్రీల వద్ద ఉంచాలి. దీంతో బిల్లులో నెలకు ఎంత లేదన్నా రూ.4000 నుంచి రూ.6000 వరకు ఆదా చేయవచ్చు.
  • 5. విద్యుత్ ఉపకరణాలకు విడి విడిగా ఔట్ లెట్‌లు కాకుండా అన్నింటికీ కలిపి ఒకటే ఉండేలా ఎక్స్‌టెన్షన్ బాక్స్ లు లేదా పవర్ స్ట్రిప్‌లను వాడాలి. దీంతో వినియోగంలో లేని సమయంలో అన్నింటినీ ఒకేసారి సులభంగా ఆపేయవచ్చు. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది. బిల్లు తక్కువగా వస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Does the electricity bill get higher every month? Following these tips can reduce your electricity bill."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0