Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employment education after internship

ఉద్యానం.. ఉపాధి సోపానం..

Employment education after internship

  • ఇంటర్‌ తరువాత ఉపాధి విద్య
  • ఎంసెట్‌ రాసిన విద్యార్థులే అర్హులు
  • రాష్ట్రవ్యాప్తంగా 540 సీట్లు
  • టెన్త్‌ తరువాత అవకాశం
  • పెరుగుతున్న డిమాండ్‌

ఉద్యాన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నా యి. సొంతంగా వారి కాళ్లపై వారు నిలబడే స్థాయికి ఉద్యాన కోర్సులు పూర్తి చేసిన వారికి దక్కుతున్నాయి. నేడు ఆక్వా తరువాత రెండవ స్థానంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఉద్యాన వన పంటల ద్వారానే వస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి బదులుగా ఉద్యాన వనాలను ఏర్పాటు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. ఎందు కంటే ఎక్కడ చూసిన ఉద్యాన పంటలను పండించే రైతులు లాభాల బాట పడుతున్నారు. గతంలో రైతులు మెట్టు ప్రాంతంలో ఒకే రకమైన సాగుకు ఇష్టపడేవారు. ఇప్పడు పరిస్థితులు మారాయి. రైతుల్లో అవగాహన పెరిగింది. మార్కెటింగ్‌ చేసుకునే అవ కాశాలు పెరగడంతో సాగుపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉద్యాన విద్య పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

 దరఖాస్తు విధానం ఇలా...

ఎంసెట్‌లో ర్యాంక్‌ సాధించిన విద్యార్థులు ఠీఠీఠీ.్చుఽజట్చఠ అనే వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.ర్యాంక్‌ కార్డు వచ్చిన తరువాత ఆచార్య ఎన్‌జీరంగా యూనివర్సీటీలో దరఖాస్తు చేయాలి.ఆ తరువాత ఎంసెట్‌ రిజల్ట్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ చేసి బీఎస్సీ (హానర్స్‌) హార్టీకల్చర్‌లో నాలుగేళ్ల కోర్సు చదివేందుకు అవకాశం కల్పిస్తారు. ప్రతి ఏటా ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సీటీ ద్వారా వెటర్నరీ, అగ్రికల్చర్‌, హార్టీకల్చర్‌ కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉద్యానవర్సిటీ కళాశాలలే కాకుండా ఉద్యాన వర్సిటీ గుర్తింపు పొందిన నాలుగు ప్రైవేటు కళాశాలలు కూడా ఉన్నాయి. అనంతపురంలో రెండు, ప్రకాశం జిల్లాలో రెండు ఏర్పాటు చేశారు. అనంతపురంలో శ్రీకృష్ణదేవరాయ ఉద్యాన కళాశాల, తాడి పత్రిలో జేసీడీ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. ఇక ప్రకాశం జిల్లాలో కదిరిబాబూరావు ఉద్యాన కళాశాల (సీలంవారిపల్లి) ,మార్కాపురంలో ఎన్‌ఎస్‌ కాలేజ్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ కళాశాలను ఏర్పాటు చేశారు.

ఏడాదికి 540 సీట్లు...

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సీటీ పరిఽధిలో వీఆర్‌ గూడెం ఉద్యాన కళాశాలలో 130 సీట్లు, కడప అనంతరాజ్‌పేటలో ఉన్న కళాశాలలో 70 సీట్లు, విజయనగరం జిల్లా పార్వతీపురం కళాశాలలో 50 సీట్లు, ప్రకాశం జిల్లా చినలాటరపి కళాశాలలో 50 సీట్లు ఉంటాయి. మొత్తం 300 సీట్లు ఎంసెట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. వీటిలో 13 సీట్లు పేమెంట్‌ సీట్లుగా ఉంటాయి. నాలుగు ప్రైవేట్‌ కళాశాలల్లో 240 మందికి సీట్లు కేటాయిస్తారు.ఒక్కో కళాశాలలో 60 సీట్లు చొప్పున ఉంటాయి. కళాశాలకు ఉండే సీట్లలో 21 సీట్లు మేనేజ్‌మెంట్‌కు కేటాయించగా 39 సీట్లు ఎంసెట్‌ ద్వారా ర్యాంక్‌ కార్డు పొందినవారు, ఎన్‌జీరంగా యూనివర్శిటీకి దరఖాస్తు చేసిన వారికి మాత్రమే కేటాయిస్తారు. మేనేజ్‌మెంట్‌ కోటాలో కేటాయించిన 21 సీట్లు కేటాయింపు నకు ఎంసెట్‌ పరీక్ష రాసి ఉండాలి.. యూనివర్సిటీకి వీరు కూడా దరఖాస్తు చేసి ఉండాలి ఇలాంటి వారికి నేరుగా మేనేజ్‌మెంట్‌ కమిటీ సీట్లు కేటాయిస్తుంది. ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ ద్వారా వీరికి కౌన్సెలింగ్‌ ఉండదు.

ఇతర రాష్ర్టాల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 15 శాతం సీట్లు...

కర్నాటకలో ఉన్న ఉద్యాన కళాశాలలో ప్రభుత్వం, ప్రైవేట్‌ కళాశాలలు ఇచ్చే సీట్లు కంటే ఎన్‌ఆర్‌ఐ కోటా కింద 15 శాతం సీట్లను కేటాయిస్తున్నాయి. కర్నాటకలోని యూనివర్శిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సైన్స్‌ (షిమోగా) వంటి కళాశాలలో 4 వేల డాలర్లకే ఎన్‌ఆర్‌ఐ కోటాలో సీట్లు కేటాయిస్తున్నారు. ఎన్‌ఆర్‌ఐ కోటా కింద చదివే విద్యార్థులు విదేశాల్లో ఉండే బంధువు నుంచి గుర్తింపుకార్డు, ఫీజు నేనే చెల్లిస్తాను అని అగ్రిమెంట్‌ ఫారం ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు విద్యార్థి తండ్రి కూడా ఒక ఎన్‌ఆర్‌ఐ కట్టకపోతే తానే కడతానని అఫిడవిట్‌ జతచేయాల్సి ఉంటుంది.ఇలా 15 శాతం అదనంగా విద్యార్థులు ఉద్యాన కోర్సులను చదివేందుకు అవకాశాలు ఉన్నాయి.

ఏఐఈఈఏ పరీక్ష రాసినా...

కేవలం ఎంసెట్‌ ఒక్కటే మార్గం కాదు. ఇతర రాష్ర్టాల్లోని కళాశాలల్లో చదివేందుకు ఏఐఈఈఏ (ఆలిండియా ఎంట్రన్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌) పరీక్ష రాసి కూడా ఉద్యాన కోర్సుల్లో చేరవచ్చు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రతి ఏడాది మార్చి నుంచి ఏప్రిల్‌ నెలలో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలు మాత్రం ప్రతి ఏడాది జూన్‌ నెలలో ఉంటాయి. ఇలా కళాశాలల్లో విద్య చదివిన విద్యార్థులకు నెలకు రూ.3 వేలు స్కాలర్‌షిప్‌గా ఇస్తారు. ఇతర రాష్ర్టాల్లో చదివేందుకు 15 శాతం నాన్‌లోకల్‌ కోటా కింద కేటాయిస్తారు. మన రాష్ట్రంలో అయితే నేరుగా కళాశాలలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి జూనియర్‌ రీసెర్చి ఫెలోషిఫ్‌(జేఆర్‌ఎఫ్‌), సీనియర్‌ రీసెర్చి ఫెలోషిఫ్‌కు వెళ్లేందుకు అవకాశం ఉంది.

పాలిటెక్నిక్‌ కోర్సులు...

పాలిటెక్నిక్‌ హార్టీకల్చర్‌ కోర్సులు కూడా ఉన్నాయి. రెండేళ్ల కోర్సుగా ఉంటుంది. 10వ తరగతి తరువాత ఈ కోర్సులను ఎంపిక చేసుకోవచ్చు. మడకశిర, రామచంద్రపురం ప్రభుత్వం కళాశాలలో మాత్రం 60 సీట్లు ఉన్నాయి. మిగిలిన 9 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మాత్రం 40 సీట్లు మాత్రమే కేటాయించారు. ప్రభుత్వ కళాశాలలు మడకశిర, కలికిరి, రామచంద్రాపురం, నూజివీడులో మాత్రమే ఉన్నాయి. నాలుగు సెమిస్టర్లుగా నిర్వహిస్తారు. సెమిస్టర్‌కు రూ.10 వేలు వంతున ఫీజులు వసూలు చేస్తారు. ఇలా నాలుగు సెమిస్టర్లకు రూ.40 వేలు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవి కాక మెస్‌చార్జీలు అదనంగా ఉంటాయి. ఇక ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏడు చోట్ల ఉన్నాయి. బద్వేలు, కోవెలకుంట్ల, మద్దిరాల, జంగారెడ్డిగూడెం, నెల్లిమర్ల, హెచ్చర్ల, పొదిలిలో ఉన్నాయి.ఈ పాలిటెక్నిక్‌ కోర్సులు పూర్తి చేసు కున్న వారికి ఉద్యాన బీఎస్సీ కోర్సులో మెరిట్‌ ఆధారంగా 15 సీట్లు కేటాయిస్తారు.

 ఉపాధికి కొదువ లేదు : లక్ష్మీనారాయణ రెడ్డి, డీన్‌

ఉద్యాన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఐసీఈఆర్‌, కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ సంస్థలోను, ప్రతి మునిసిపాలిటీలోను, ఎండోమెంట్‌, రైల్వే, ఆర్కియాలజీ, కాఫీ బోర్డు, చిల్లిబోర్డు, టీ బోర్డు, ఫారెస్ట్‌ ఆఫీసర్లు,సీడ్‌ కంపెనీలు,ఫెస్టిసైడ్స్‌, పంగిసైడ్స్‌, ప్రొసెసింగ్‌ యూనిట్లు, వేర్‌హౌస్‌, సెంట్రల్‌ గర్నమెంట్‌,ఆలిండియా రేడియో వంటి రంగాల్లో అవకాశాలు ఉన్నాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employment education after internship"

Post a Comment