Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Formative assessment marks are crucial if the tenth class examinations are not held.

  పదవ తరగతి పరీక్షలు జరగకుంటే ఫార్మేటివ్ అసిస్మెంట్ మార్కులే కీలకం..

Formative assessment marks are crucial if the tenth class examinations are not held.


 పరీక్షలు జరగకుంటే ఈ మార్కులనే ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణత ప్రకటిస్తారు..

 పరీక్షలు జరగకుంటే ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులతోనే గ్రేడింగ్ ఇచ్చే అవకాశం..

ఈనేపథ్యంలో పాఠశాలల్లో మార్కుల అప్ లోడ్ ప్రక్రియ వేగవంతం..


జూన్ 1 : పది పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి . ఈనెల 7 వ తేదీ నుంచి జరగాల్సిన పది పరీక్షల్ని తాజాగా ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే . పది పరీక్షలు నిర్వహించి తీరుతాం అని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది . ఒక వేళ పది పరీక్షలు నిర్వహించకుంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని ఉత్తీర్ణత ప్రకటిస్తారు . ఈ నేపథ్యంలో పాఠశాలల్లో మార్కుల అప్ లోడ్ ప్రక్రియను వేగవంతం చేశారు . రెండు వారాల క్రితం మార్కుల అప్లోడ్ ప్రారంభమైంది . ఇప్పటికే దాదాపు 90 శాతం పూర్తి అయింది మరో 10 శాతం మార్కులు సాంకేతిక కారణాలతో అప్లోడు కాలేదని , రెండు మూడురోజుల్లో నూరుశాతం మార్కులు అప్లోడు చేస్తామని డీఈవో ఆర్ఎస్ -

గంగాభవాని వెల్లడించారు . జిల్లాలో ప్రభుత్వ , జడ్పీ , ఎయిడెడ్ , గురుకుల , నగరపాలక సంస్థ , మున్సిపపాల్టీలు , ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో దాదాపు 1,025 పాఠశాలున్నాయి . ఆయా పాఠశాలల్లో పరీక్షలు రాసే విద్యార్థులు దాదాపు 59 వేల మంది ఉన్నట్లు సమాచారం . విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 , 2 లో వచ్చిన మార్కులు ఈ ఏడాది కీలకం కానున్నాయి . ప్రభుత్వ , ప్రైవేటు ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఎస్ఎ -1 అప్లోడు 92 శాతం , ఎఫ్ -2 89 శాతం పూర్తి అయింది . ప్రభుత్వ , ప్రైవేటు ఆధ్వర్యంలో ఉన్న 1,020 పాఠశాలల్లో 59 వేల మంది విద్యార్థుల మార్కులు అప్లోడు చేస్తారు . సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు , ఇంటర్నల్ మార్కులు కూడా కేటాయిస్తారు . పది విద్యార్థుల మార్కుల ఆలోడు చేసే విషయంలో ప్రభుత్వ , ప్రైవేటు యాజమాన్యాల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Formative assessment marks are crucial if the tenth class examinations are not held."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0