Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Loan: Buying a New Home ... But More Cheap Home Loans Interest Rates Details.

 Home Loan: కొత్త ఇల్లు కొంటున్నారా...అయితే మరింత చౌకగా హోమ్​లోన్స్​ వడ్డీ రేట్లు వివరాలు.

Home Loan: Buying a New Home ... But More Cheap Home Loans Interest Rates Details.

ప్రస్తుతం హోమ్​లోన్స్​ వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే హోమ్​ లోన్స్​ పొందవచ్చు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రాసెసింగ్​ ఫీజులను కూడా తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్​లో తక్కువ వడ్డీకే హోమ్​లోన్స్ ఇచ్చే బ్యాంకులను పరిశీలిద్దాం.

సొంతిళ్లు ఉండాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే ఓవైపు చేతిలో తగినంత డబ్బు లేక, మరోవైపు బ్యాంకు వడ్డీ రేట్లు చూసి వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారికి ఇదే మంచి సమయమని చెబుతున్నారు మార్కెట్​ నిపుణులు. ఎందుకంటే ప్రస్తుతం హోమ్​లోన్స్​ వడ్డీ రేట్లు నాలుగు దశాబ్ధాల కనిష్టానికి పడిపోయాయి. ఈ సమయంలో అతి తక్కువ వడ్డీకే హోమ్​ లోన్స్​ పొందవచ్చు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రాసెసింగ్​ ఫీజులను కూడా తగ్గించాయి. ప్రస్తుతం మార్కెట్​లో తక్కువ వడ్డీకే హోమ్​లోన్స్ ఇచ్చే బ్యాంకులను పరిశీలిద్దాం.

తక్కువ వడ్డీకే హోమ్​ లోన్స్​ అందిస్తున్న బ్యాంకులు వివరాలు.

1) కోటక్ మహీంద్రా బ్యాంక్

ప్రైవేటు రంగ బ్యాంకింగ్​ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్​లో అతి తక్కువ వడ్డీ రేట్లకు హోమ్​ లోన్​ అందిస్తుంది. హోమ్​లోన్​ వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) తగ్గించి 6.65 శాతానికే అందిస్తుంది. జీఎస్టీతో సహా ప్రాసెసింగ్ ఫీజును కేవలం 0.50% మాత్రమే వసూలు చేస్తుంది.

2) పంజాబ్ & సింధ్ బ్యాంక్

ప్రభుత్వం రంగ పంజాబ్ & సింధ్ బ్యాంక్ 6.65% వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. 40 సంవత్సరాల కాలపరిమితి వరకు ఈ రుణాలను అందజేస్తుంది. జూన్ 30 లోపు హోమ్​ లోన్​ తీసుకునే వారి నుంచి ఎటువంటి ప్రాసెసింగ్​ ఫీజు వసూలు చేయడం లేదు.

3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.70% వడ్డీ రేటుతో హోమ్​లోన్లను అందిస్తుంది. మీరు తీసుకున్న లోన్​ మొత్తం నుంచి 0.4% ప్రాసెసింగ్​ ఫీజు వసూలు చేస్తుంది. ఇది కనిష్టంగా రూ .10,000 నుంచి గరిష్టంగా రూ .30,000 వరకు ఉంటుంది. మహిళా ఖాతాదారులకు బ్యాంక్ అదనపు రాయితీని కూడా అందిస్తుంది.

4) హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

ప్రైవేట్ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 6.75 వడ్డీ రేటుతో హోమ్​లోన్లను అందిస్తుంది. కానీ ప్రాసెసింగ్ ఫీజు మాత్రం మీ ఉద్యోగం, ప్రోఫైల్​ను బట్టి మారుతుంది. సెల్ఫ్​ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్​​ విషయంలో.. ప్రాసెసింగ్ ఫీజు లోన్​ మొత్తంలో 0.5% లేదా రూ. 3000 ఏది ఎక్కువైతే అది వర్తిస్తుంది. నాన్​ సెల్ఫ్​ ఎంప్లాయిడ్​ ప్రొఫెషనల్ విషయంలో 1.5% వరకు లేదా రూ. 4,500 ఏది ఎక్కవైతే అది వర్తిస్తుంది.

5) ఐసిఐసిఐ బ్యాంక్

ఐసిఐసిఐ బ్యాంక్​ 6.75% వడ్డీ రేటుతో హోమ్​లోన్లను అందిస్తుంది. మీరు చేసే ఉద్యోగం, జీతం వంటి విషయాలను బట్టి ప్రాసెసింగ్ ఫీజు మారుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Loan: Buying a New Home ... But More Cheap Home Loans Interest Rates Details."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0