Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Jagannath Educational Vidyakanuka- Guidelines

 జగనన్న విద్యా కానుక పంపిణీ – మార్గదర్శకాలు

Jagannath Educational Vidyakanuka- Guidelines


సమగ్ర శిక్షా ‘జగనన్న విద్యా కానుక’ 2021-22 -విద్యార్థులకు కిట్లను క్షేత్రస్థాయిలో పంపిణీ కొరకు – సమగ్ర శిక్షా సీఎంవోలకు, మండల విద్యాశాఖాధికారులకు మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మార్గదర్శకాలు.

ముఖ్యంగా గమనించవలసిన విషయాలు

‘జగనన్న విద్యా కానుక’లో భాగంగా ఒక్కో విద్యార్థికి మూడు జతల యూనిఫాం క్లాత్, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు రెండు జతల సాక్సులు, బెల్టు, బ్యాగు, నిఘంటువులను కిట్ రూపంలో అందించవలసి ఉంటుంది.

‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమం విజయవంతం చేయడంలో భాగంగా స్కూల్ కాంప్లెక్స్/ మండల పరిధిలో మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పరస్పర సహకారంతో పని చేయాలి.

‘జగనన్న విద్యాకానుక’లో భాగంగా నోటు పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు మరియు ఒక జత బూట్లు & రెండు జతల సాక్సులు 4031 స్కూల్ కాంప్లెక్స్ లకు, యూనిఫాం క్లాత్ 670 మండల రిసోర్సు కేంద్రాలకు అందజేస్తారు.

సరుకు స్కూల్ కాంప్లెక్సుకు/ మండల రిసోర్సు కేంద్రానికి వచ్చేముందు సప్లయర్స్ సంబంధిత

స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు/ మండల విద్యాశాఖాధికారి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు. అందుకున్న వివిధ సరుకులకు సంబంధించిన వివరాలను స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించబడిన వారి లాగిన్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. కిట్ల కు  సంబంధించిన వస్తువులు అందినవి అందినట్లు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉపాధ్యాయులు,

సిబ్బంది సహకారంతో ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారులు నమోదు చేసిన వివరాలను (ఎన్ని వచ్చాయి? ఇంకా ఎన్ని అందాలి?) ఎప్పటికప్పుడు  జిల్లా అధికారులు గమనిస్తూ ఉండాలి.

సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ ముద్ర వేయాల్సి ఉంటుంది.

తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

సప్లయర్స్ సరఫరా చేసిన సరుకులను భద్రపరచడానికి స్కూల్ కాంప్లెక్సులో లేదంటే దగ్గరలోని భద్రతా ప్రమాణాలు కలిగిన పాఠశాలలో భద్రపరచాలి.

సంబంధిత కేంద్రానికి చేరిన సరుకు భద్రపరిచే గది వెలుతురు తగిలేలా, ఎలుకలు, చెదలు వంటివి లేకుండా తడి, చెమ్మ లేకుండా, వర్షం నీరు రాకుండా ఉండేలా భద్రతా ప్రమాణాలు పాటించాలి.

మండల రిసోర్సు కేంద్రం | స్కూల్ కాంప్లెక్సుకు చేరిన మెటీరియల్ నందలి అన్ని రకాల వస్తువులను పరిశీలించవలసి ఉంటుంది. (ఉదాహరణకు: నోటు పుస్తకాలకు సంబంధించి వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా అన్ని రకాల నోటు పుస్తకాలు పరిశీలించాలి. 

అలాగే అన్ని రకాల బ్యాగులు, బెల్టులు మరియు బూట్లు & సాక్సులు, యూనిఫాం

క్లాత్ పరిశీలించాల్సి ఉంటుంది.)

ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సుకు సరుకు తగినంత అందిందో లేదో సరిచూసుకోవాలి.

ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు అందజేసే మెటిరీయల్ నందలి వివిధ రకాల వస్తువులు కార్టన్లు/సంచులు/ ప్యాకెట్ల రూపంలో చేరతాయి. అందులో ప్రతి రకానికి సంబంధించి కనీసం ఒక కార్టన్/ సంచి/ ప్యాకెట్ ను పూర్తిగా పరిశీలించాలి.

యూనిఫాం క్లాత్ మండల రిసోర్సు కేంద్రానికి ప్యాకెట్లతో కూడిన బేల్ రూపంలో చేరుతాయి.

స్కూల్ కాంప్లెక్స్ కు అందజేసిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించిన యెడల సంబంధిత

మండల విద్యాశాఖాధికారి వారికి వెంటనే తెలియజేయవలసి ఉంటుంది.

మండల రిసోర్సు కేంద్రం నందు చేరిన వస్తువుల్లో ఏవైనా పాడైనవి, చినిగినవి గుర్తించిన యెడల సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి/ సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి వెంటనే సమాచారం అందించవలసి ఉంటుంది.

JVK KITS INSTRUCTIONS CLICK HERE

బ్యాగులు అందిన తర్వాత  తరగతి వారీగా వస్తువులన్నీ సెట్లుగా చేసి బ్యాగులో పెట్టించాలి.

ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధంగా విద్యార్థులకు వెంటనే అందజేయగలిగే విధంగా కిట్లు సన్నద్ధంగా ఉంచాలి.

సంబంధిత మండల రిసోర్సు కేంద్రం నుంచి సరుకును కిట్ల రూపంలో పాఠశాలలకు చేర్చాలి. (కిట్ల తయారీ కోసం అవసరం మేరకు కూలీలను పెట్టుకుని బిల్లు పెట్టుకోవచ్చు.)

తరగతి వారీగా ఏ విద్యార్థికి ఏయే వస్తువులు ఎన్నెన్ని ఇవ్వాలో పొందుపరచడమైనది.

ఈ కార్యక్రమం అమలు కోసం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సీఆర్పీలు మరియు కార్యాలయ సిబ్బంది సహాయ సహకారాలు తీసుకోవాలి. ఈ కార్యక్రమం సమిష్టి బాధ్యతగా భావించాలి.

నోటు పుస్తకాలకు సంబంధించి

సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా సరుకు అందుతుంది.

బాక్సుల్లో నోటు పుస్తకాలు స్కూల్ కాంప్లెక్సులకు చేరుతాయి. ఒక్కో బాక్సులో ఒకేరకానికి చెందిన నోటు పుస్తకాలు ఉంటాయి. వైట్ నోట్ బుక్స్, రూల్డ్ నోట్ బుక్స్, బ్రాడ్ రూల్డ్, గ్రాఫ్ పుస్తకాలు ఇలా నాలుగు రకాల నోటు పుస్తకాలు ఉంటాయి. వీటికి సంబంధించిన కవర్ పేజీల ఫొటోలు ఇవ్వడమైనది. ప్రతి స్కూల్ కాంప్లెక్సుకు ఎన్నెన్ని వస్తువులు అందజేయబడతాయో పొందుపరచడమైనది.

నోటు పుస్తకాలు సంబంధిత స్కూల్ కాంప్లెక్సుకు చేరగానే పేర్కొన్నట్లు సరిపోయినంత సరుకు వచ్చిందా లేదా సరి చూసుకోవాలి. లేనిపక్షంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సదరు మండల విద్యాశాఖాధికారులకు తెలియజేయాలి.

రవాణా సమయంలో నోటు పుస్తకాలు ఏవైనా చినిగినవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. అటువంటి పరిస్థితుల్లో వాటిని రిజక్ట్ చేసి సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి. మరియు ‘జగనన్న విద్యాకానుక’ యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం

jvk2apss@gmail.com కు ఈమెయిల్ పంపాలి.

యూనిఫాం సంబంధించి

యూనిఫాం సరుకు లోడు మండల రిసోర్సు కేంద్రానికి వచ్చేముందు సప్లయిర్స్ సంబంధిత మండల విద్యాశాఖాధికారి వారికి ఫోన్ ద్వారా సమాచారం అందిస్తారు.

మీ మండల రిసోర్సు కేంద్రానికి సరిపోయినంత సరుకు వచ్చిందా లేదా సరిచూసుకోవాలి. యూనిఫాంకు సంబంధించిన ప్యాక్ కవర్ పైన బాలికలకు సంబంధించినవైతే ‘Girls’ అని, బాలురకు సంబంధించినవైతే ‘Boys’ అని, దీంతోపాటు తరగతి అంకె ముద్రించి ఉంటుంది.  ఎవరిదైతే వారి దగ్గర ‘టిక్’ మార్క్ ముద్రించి ఉంటుంది. బేల్లో యూనిఫాం ప్యాకెట్లు ఉంటాయి.

ఒక్కొక్క బేల్ లో ఎన్నెన్ని ప్యాకెట్లు ఉంటాయో ముద్రించి ఉంటుంది.

ఒక్కో బేల్ లో ఒకే తరగతికి చెందిన యూనిఫాం క్లాత్ ప్యాకెట్ల రూపంలో వస్తుంది.

ఒక్కో ప్యాకెట్లో 3 జతలకు సరిపడే యూనిఫాం క్లాత్ ఉంటుంది.

ఒకటి నుండి 5వ తరగతి బాలికలకు, అన్ని తరగతుల బాలురకు ప్యాకెట్లో రెండు క్లాత్ పీసులు ఉంటాయి.

6-8 తరగతుల బాలికలకు 3 క్లాత్ పీసులు ఉంటాయి. తరగతి వారీగా షర్టింగ్, సూటింగ్, చున్నీకి సంబంధించిన కొలతలు కూడా ముద్రించి ఉంటాయి.

యూనిఫాం బేల్ లో ఒక్కో తరగతికి చెందిన క్లాత్ కొలతలు సరిగా సరిపోయాయా లేదా అనేది బేల్ లో ఒక ప్యాకెట్ తీసుకుని చెక్ చేయాలి.  అలానే అన్ని తరగతులకు చెందిన బాలబాలికల క్లాత్ కొలతలు సరిగా ఉన్నాయా లేదా అనేది స్కేలు/ టేపుతో కొలిచి పరిశీలించాలి)

రవాణా సమయంలో యూనిఫాం ఏవైనా చినిగినవా లేదా పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో యూనిఫాం క్లాత్ యొక్క రంగు ఇచ్చిన నమూనాతో సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి.

వాటిల్లో క్లాత్ నాణ్యత బాగాలేకపోయినా, రంగు మారినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. రిజక్ట్ చేసిన సమాచారాన్ని సంబంధిత మండల విద్యాశాఖాధికారి/ సీఎంవో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ వారికి సమాచారం ఇవ్వాలి. మరియు ‘జగనన్న విద్యాకానుక’ యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి

సమాచారం నిమిత్తం jvk2apss@gmail.com కు ఈమెయిల్ పంపాలి

బ్యాగులకు సంబంధించి

సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా బ్యాగులు అందుతాయి.

బ్యాగులు రెండు (స్కై బ్లూ, నేవీ బ్లూ) రంగులలో, 3 సైజుల్లో (స్మాల్, మీడియం, బిగ్) మొత్తంగా 6 రకాలు ఉంటాయి. బాలికలకు స్కై బ్లూ రంగు బ్యాగులు, బాలురకు నేవీ బ్లూ రంగు బ్యాగులు అందజేయాలి.

ఎ) 1 నుంచి 5వ తరగతికి చిన్న బ్యాగు.

6, 7వ తరగతికి మీడియం సైజు బ్యాగు.

8,9,10వ తరగతులకు పెద్ద సైజు బ్యాగు అందించబడుతుంది.

 పేర్కొన్న విధంగా సరిపోయినంత సరుకు స్కూల్ కాంప్లెక్సుకు వచ్చిందా లేదా సరి చూసుకోవాలి.

రవాణా సమయంలో బ్యాగులు ఏవైనా చినిగినవా, పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి.

ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో బ్యాగు నందు డబుల్ జిప్పులు, షోల్డర్, డబుల్ రివిట్స్, షోల్డర్ స్టాప్ ఫోమ్, హ్యాండిల్, బ్యాగు ఇన్నర్ క్లాత్ సరిగా ఉన్నాయో లేదో నమూనాకు సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి.  2 లేదా 3 బేల్ లోని బ్యాగులు చెక్ చేయాలి. వాటిల్లో నాణ్యత బాగాలేకపోయినా, చినిగిపోయినా రిజక్ట్ చేసి వెనక్కి పంపవచ్చు. రిజక్ట్ చేసిన సమాచారాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.

మరియు ‘జగనన్న విద్యాకానుక’ యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత

రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం jvk2apss@gmail.com కు ఈమెయిల్ పంపాలి.

బెల్టులకు సంబంధించి

సప్లయిర్స్ నుంచి స్కూల్ కాంప్లెక్సులకు నేరుగా సరుకు అందుతుంది.

బెల్టులు నాలుగు రకాలు అందజేయబడతాయి.

1 నుంచి 5 వతరగతి బాలురు (80 సెంటీమీటర్లు)

6 నుంచి 8వ తరగతి బాలురు (90 సెంటీమీటర్లు)

9,10వ తరగతి బాలురు (100 సెంటీ మీటర్లు)

డి) 1 నుంచి 5 వతరగతి బాలికలకు ప్లాస్టిక్ బకెల్ తో కూడిన శాటన్ క్లాత్ బెల్ట్ (80 సెంటీమీటర్లు)

 పేర్కొన్నట్లు సరిపోయినంత సరుకు స్కూల్ కాంప్లెక్సులకు వచ్చిందా లేదా సరి

చూసుకోవాలి. వచ్చిన బెల్టుల్లో నవారు చినిగిపోయిందా? ఏమైనా డ్యామేజ్ అయ్యిందా తనిఖీ చేయాలి. బెల్టు బకెలకు లింక్ సరిగా ఉందా లేదా గమనించాలి.

రవాణా సమయంలో ఏవైనా చినిగినవా, పాడైనవా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా గమనించవలసిన విషయాల్లో నమూనా బెల్టుతో వచ్చిన సరుకులోని బెల్టులు సరిపోలి ఉందా లేదా అని చూసుకోవాలి.

వాటిల్లో నాణ్యత బాగా లేకపోయినా, చినిగిపోయినా, డ్యామేజ్ అయిన రిజక్ట్

చేసి వెనక్కి పంపవచ్చు. రిజక్ట్ చేసిన సమాచారాన్ని స్కూల్ కాంప్లెక్స్

ప్రధానోపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖాధికారికి తెలియజేయాలి.

 మరియు ‘జగనన్న విద్యాకానుక’ యాప్ నందు నమోదు చేయాలి. తర్వాత రాష్ట్ర కార్యాలయానికి సమాచారం నిమిత్తం

jok2apss@gmail.com కు ఈమెయిల్ పంపాలి.

స్టాకు రిజిస్టర్ నిర్వహణ

ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో తప్పనిసరిగా ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి ఒక స్టాకు రిజిస్టరును నిర్వహించాలి. స్టాకు వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవాలి.

రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అధికారులు సంబంధిత మండల రిసోర్సు కేంద్రం | స్కూల్ కాంప్లెక్సుకు తనిఖీ నిమిత్తం సందర్శించినప్పుడు స్టాకు రిజిస్టర్త ప్పనిసరిగా చూపించవలసి ఉంటుంది.

డెలివరీ చలానాలు

ప్రతి మండల రిసోర్సు కేంద్రం / స్కూల్ కాంప్లెక్సులో ‘జగనన్న విద్యాకానుక’కు సంబంధించి వస్తువులు వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్న తర్వాత చలానాల్లో సంతకాలు పెట్టాలి.

సప్లయిర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంతకం చేసి కార్యాలయ  ముద్ర వేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ చలానా ఒకటి పాఠశాలలో, మరొకటి జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఏపీసీ దగ్గర, మూడో చలానా రాష్ట్ర కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుంది.

సప్లయర్స్ ఇచ్చే 3 చలానాల్లో సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు/ మండల విద్యాశాఖాధికారి సంతకం, వస్తువులు తీసుకున్న తేదీ తప్పక ఉండేలా చూసుకోవాలి.

లాగిన్లలో నమోదు

‘జగనన్న విద్యాకానుక’ స్టూడెంట్ కిట్ల పంపిణి వివరాలు ‘జగనన్న విద్యా కానుక’యాప్ నందు నమోదు చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లాగిన్ వివరాలు సంబంధిత జిల్లాలకు పంపడం జరిగింది.

రాష్ట్రంలోని అందరూ జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ప్రభుత్వం

ఎప్పటికప్పుడు ప్రకటించే కోవిడ్ నియమనిబంధనలు పాటిస్తూ కార్యక్రమం సక్రమంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి.

4రకాల బెల్టుల వివరాలు:

1-5 తరగతులు బాలురు : 80 సెం.మీ

6-8 తరగతులు బాలురు : 90 సెం.మీ

9-10 తరగతులు బాలురు: 100 సెం.మీ

1-5 తరగతుల అమ్మాయిలకు ప్లాస్టిక్ బకెల్ తో కూడిన శాటన్ క్లాత్ బెల్టు :80 సెం.మీ 

️13 జిల్లాల పాఠశాల సముదాయాల (స్కూల్ కాంప్లెక్స్ )వారీ మరియు తరగతి వారీ కిట్ ల వివరాలు

మీ పాఠశాల సముదాయం( స్కూల్ కాంప్లెక్స్ ) నకు  ఐటమ్ వారీగా ఎన్నెన్ని కిట్స్ శాంక్షన్ అయ్యాయో CHECK చేసుకోవచ్చును .


ANNEXURE-2 FOR CLASSWISE INFORMATION CLICK HERE


మీ పాఠశాల సముదాయం( స్కూల్ కాంప్లెక్స్ ) నకు  ఐటమ్ వారీగా ఎన్నెన్ని కిట్స్ శాంక్షన్ అయ్యాయో CHECK చేసుకోవచ్చును .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Jagannath Educational Vidyakanuka- Guidelines"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0