Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Invitation for applications for 5th class admission in Gurukul schools

 గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.

Invitation for applications for 5th class admission in Gurukul schools

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న 38 సాధారణ , 12 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ( రీజనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గురుకుల బాలుర పాఠశాలలు తాడికొండ గుంటూరు జిల్లా , కొడిగెనహళ్ళి అనంతపురం జిల్లా తో సహా ) 2021-22 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ( ఇంగ్లీషు మీడియం ) లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం అయిందని, ఈనెల 30 

వరకు 'https://aprs.apcfss.in'  వెబ్సైట్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు.

 ప్రవేశానికి అర్హత : ఓ.సి, బి.సిలకు చెందినవారు 2010 సెప్టెంబర్ 1 నుండి 2012 ఆగస్టు 31మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలు  2008 సెప్టెంబర్ 1 నుండి 2012 ఆగస్టు 31 మధ్య పుట్టి ఉండాలి.

 అభ్యర్థులు సంబంధిత జిల్లాలో 2019-20,  2020-21 విద్యాసంవత్సరాలలో నిరవధికంగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 3 మరియు 4 తరగతులు చదివి ఉండాలి.

 ఓసీ, బీసీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాలి.

 గ్రామీణ మరియు పట్టణ ప్రాంత  ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు జనరల్, మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు.

 ఆదాయపరిమితి : అభ్యర్ధి తల్లి తండ్రి / సంరక్షకుల సంవత్సరాదాయం ( 2020-21 ఆర్థిక సంవత్సరం) రూ .1,00,000 మించి ఉండరాదు.

 సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు . 

 అభ్యర్ధులు పై అర్హతలు పరిశీలించుకొని  ప్రాధమిక వివరాలతో ఆన్ లైన్లో దరఖాస్తు సమర్పించాలి

 దరఖాస్తులో అభ్యర్థి పేరు , పుట్టినతేది, మొబైల్ నెంబర్, సంతకంతో కూడిన పాస్పోర్ట్ సైజు ఫోటో ఉండాలి.

 అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా రూ. 50  చెల్లించిన తరువాత ఒక జర్నల్ నెంబరు ఇవ్వబడుతుంది. 

 దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రాన్ని   'https://aprs.apcfss.in' లో పరిశీలించి అదే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలి.

 జిల్లావారీగా సంబంధిత జిల్లా కలెక్టరు కార్యాలయంలో లాటరీ పద్ధతి ద్వారా జులై 14న ఎంపిక ఉంటుందన్నారు.  ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు కౌన్సిలింగ్ ద్వారా అదే రోజు జరుగుతుందని ప్రసన్నకుమార్ తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Invitation for applications for 5th class admission in Gurukul schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0