Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Government Jobs

 AP Government Jobs  ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. ఈ నెలలో 1328 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వివరాలివే.

AP Government Jobs


ఏపీలోని సీఎం వైఎస్ జగన్ సర్కార్ ఉద్యోగాల భర్తీపై గత నెలలో రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో మొదటిది జ్యాబ్ క్యాలెండర్ విడుదల కాగా.. రెండవది ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దు చేయడం.

రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో అధికారులు పేర్కొన్నారు.

అయితే.. ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ జులై నెలలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ, డీఏ బ్యాక్ లాగ్ ఉద్యోగాలను ఈ నెలలో భర్తీ చేయాల్సి ఉంది.

జాబ్ క్యాలెండర్ లో తెలిపిన ప్రకారం ప్రతీ నెలలో ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని గతంలోనే సర్కార్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెలలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీని పూర్తి చేయనున్నారు అధికారులు.

రాష్ట్రంలోని 802 ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి సర్కార్ యూనివర్సిటీలు, నియామక సంస్థలు, వివిధ విభాగాధిపతులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

ఈ మేరకు ఈ నెల 2వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్హతల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. అయితే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ద్వారా భర్తీ చేసే పోస్టులకు మాత్రం ఈ విధానం వర్తించదని ప్రభుత్వం తెలిపింది.

ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ, 370 ఎస్టీలకు సంబంధించినవి ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సర్కార్ ఉత్తర్వుల్లో తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Government Jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0