Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Big shock to Jagan Sarkar ... RBI, which has taken all the money in the account, is struggling again for salaries.

 ఆంధ్రప్రదేశ్ సర్కార్‌‌కు భారీ షాక్... అకౌంట్లో సొమ్మంతా లాగేసుకున్న RBI, జీతాల కోసం మళ్లీ కష్టాలే.

Big shock to Jagan Sarkar ... RBI, which has taken all the money in the account, is struggling again for salaries.

జూలైలో పదో తేదీ దాటినా ఇప్పటికీ పూర్తిగా ఉద్యోగులకు వేతనాలు అందలేదు. రిటైర్డ్‌ ఉద్యోగులకు గురువారం రాత్రి నుంచి మెల్లగా పెన్షన్లు పడటం మొదలైంది. తాజాగా ఆర్బీఐ ఇచ్చిన షాక్‌తో ప్రభుత్వానికి ఎటూ పాలుపోవడం లేదు.

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్

రూ.3,470 కోట్లు ఓవర్‌డ్రాఫ్ట్‌లోకి జమ చేసుకున్న ఆర్బీఐ

జీతాలు, పెన్షన్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం

ఎవరైన బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని గడువులోపు కట్టకపోతే ఏం చేస్తారు.. మనకు రావాల్సిన మొత్తాన్ని లాక్కుని వారి ఖాతాలో జమ చేసుకుంటారు. ఇది ప్రజలకే కాదు.. ప్రభుత్వాలకు వర్తిస్తుంది. 

ఈ అసాధారణ పరిణామం ఆంధ్రప్రదేశ్ సర్కారుకు ఎదురైంది. సర్కారు అధిక వడ్డీకి తీసుకున్న అప్పు సొమ్ము వచ్చినట్లే వచ్చి ఆగిపోయింది. 

అప్పుగా తెచ్చుకున్న రూ.2వేల కోట్లతోపాటు, కేంద్రం ఇచ్చిన 1470 కోట్లను ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి కింద ఆర్బీఐ జమ చేసుకుంది. ఏపీ సర్కారు పరపతితో పాటు పరువూ పోయినట్లయింది.

దీంతో పదో తారీఖు దాటినా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం, విశ్రాంత ఉద్యోగాలు పెన్షన్ల కోసం ఎదురుచూపులు చేస్తున్నారు. 

జీతాల కోసమే ఏపీ సర్కారు గతంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంత వడ్డీని ఆఫర్ చేసి సెక్యూరిటీల ద్వారా మంగళవారం రూ.2వేల కోట్లు అప్పు చేసింది. 

దీంతో పాటు గురువారం కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద రాష్ట్రానికి రూ.1470 కోట్లు ఇచ్చింది. దీంతో జీతాలు, పెన్షన్లు వచ్చేస్తాయని అందరూ గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే ఓవర్‌ డ్రాఫ్ట్‌(ఓడీ) రూపంలో అసలుకే మోసం వచ్చి పడింది.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాలో తెచ్చుకున్న సొమ్మును నిర్దిష్ట గడువులోపు చెల్లించాల్సింది ఉంది. అయితే డబ్బుల కోసం ఆవురావురుమని ఎదురుచూస్తున్న జగన్ సర్కార్ ఓడీ చెల్లింపుల సంగతి మరిచిపోయింది. 

మరి రిజర్వ్ బ్యాంక్ చూస్తూ ఊరుకుంటుందా... సెక్యూరిటీల వేలంలో వచ్చిన రూ.2వేల కోట్లతో పాటు రెవెన్యూలోటు భర్తీకి కేంద్రం ఇచ్చిన రూ.1470 కోట్లను... అంటే మొత్తం రూ.3470 కోట్లను ఆర్బీఐ ఓవర్‌ డ్రాప్ట్ ఖాతాలోకి జమ చేసేసుకుంది.

సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చిన మొత్తంతో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారని ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగులు ఎదురు చూశారు. అయితే అప్పుగా వచ్చిన మొత్తంతో పాటు కేంద్ర ఇచ్చిన నగదు కూడా ఆర్‌బీఐ తీసేసుకోవడంతో జీతాల కోసం మళ్లీ అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. 

ఇంకా రూ.800 కోట్లు చెల్లిస్తే గానీ ఓడీ నుంచి రాష్ట్రం బయటపడదు. మరోవైపు ఓవర్‌ డ్రాఫ్ట్‌ బకాయి 80 శాతం జమ అయినందున, వేతనాలు, పెన్షన్లకు మరోసారి ఓడీకి వెళ్లవచ్చునని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కానీ ఆర్థిక శాఖ ఆ ధైర్యం చేయలేకపోతోంది.

ఓడీ రూ.1400కోట్లకు పైన తీసుకుంటే నాలుగు రోజుల్లో, అంతకంటే  కోట్ల ఓడీలో ఉన్నందును వేతనాలు, పెన్షన్లకు ఓడీకి వెళ్తే ఆ పరిమితి రూ.1400 కోట్లు దాటిపోతుంది. 

అలా జరిగితే తీసుకున్న ఓడీని నాలుగు రోజుల్లోనే చెల్లించాలి. అయితే ఇంత స్వల్పకాలంలో అంత సొమ్ము వచ్చే అవకాశం లేకపోవడంతో ఓడీ తీసుకుంటే చిక్కుల్లో పడతామని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Big shock to Jagan Sarkar ... RBI, which has taken all the money in the account, is struggling again for salaries."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0