Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI General Insurance:

 SBI General Insurance: ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి ‘ఆరోగ్య సుప్రీం’ ప్లాన్​ ప్రారంభం.. ప్రయోజనాల వివరాలు.

SBI General Insurance:

తాజాగా ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్.. ​‘ఆరోగ్య సుప్రీం’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. 20 బేసిక్​ కవరేజీలు, 8 ఆప్షనల్​ కవరేజీలతో సహా పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని అందించేలా ఈ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ కింద రూ. 5 కోట్ల వరకు విస్తృతమైన బీమా ఆప్షన్లను అందిస్తుంది.

స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా కేవలం బ్యాంకింగ్​ సెక్టార్​లోనే కాదు ఇన్సూరెన్స్ సెక్టార్​లోనూ దూసుకుపోతుంది. కొత్త ఇన్సూరెన్స్​ పాలసీలను ప్రవేశపెడుతూ పోటీ సంస్థలకు ధీటుగా రాణిస్తోంది. తాజాగా ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్.. ​‘ఆరోగ్య సుప్రీం’ పేరుతో కొత్త ఆరోగ్య బీమా పాలసీని ప్రారంభించింది. 20 బేసిక్​ కవరేజీలు, 8 ఆప్షనల్​ కవరేజీలతో సహా పూర్తి ఆరోగ్య బీమా కవరేజీని అందించేలా ఈ పాలసీని రూపొందించింది. ఈ పాలసీ కింద రూ. 5 కోట్ల వరకు విస్తృతమైన బీమా ఆప్షన్లను అందిస్తుంది. కస్టమర్​ అవసరాలు, కవరేజీ ఫీచర్స్​ ఆధారంగా ప్రో, ప్లస్, ప్రీమియం అనే మూడు ఆప్షన్లలో ఏదైనా ఒక దాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. సమ్ ఇన్సూర్డ్ రీఫిల్, రికవరీ బెనిఫిట్ వంటి కస్టమర్ ఫ్రెండ్లీ ఒప్పందాల్లో భాగంగా 1 నుంచి 3 ఏళ్ల వరకు పాలసీ వ్యవధి ఎంచుకునే సౌకర్యం కల్పిస్తుంది.

ఆరోగ్య సుప్రీం ప్లాన్​ ప్రయోజనాలివే..

కరోనా మహమ్మారి కారణంగా ఇన్సూరెన్స్​ పాలసీలకు భారీగా డిమాండ్​ పెరిగింది. దీంతో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ప్రీమియం ధరలను పెంచాయి అనేక ఇన్సూరెన్స్ సంస్థలు. దీంతో టర్మ్​ ఇన్సూరెన్స్​తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లలో కూడా మార్పులొచ్చాయి. ఈ విషయంపై ఎస్​బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎండి & సిఈఓ పిసి కాండ్పాల్ మాట్లాడుతూ.. “ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమాకు ప్రాధాన్యత పెరిగింది. కరోనా కారణంగా ప్రతి ఒక్కరికి బీమా అవసరం తెలిసొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆరోగ్య సుప్రీం, సమగ్ర ఆరోగ్య బీమా పథకాలను ప్రారంభించాం. వినియోగదారులు వారి అవసరాలకు తగ్గట్లు ప్రీమియం, పదవీకాలం ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం" అని చెప్పారు.

కాగా, కరోనా కేసుల పెరుగుదలతో అందరికీ ఆరోగ్య బీమాతో భద్రత, ప్రాముఖ్యత తెలిసొచ్చింది. దీంతో ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టినట్లు ఎస్​బీఐ జనరల్​ ఇన్సూరెన్స్​ పేర్కొంది. ఈ ఆరోగ్య సుప్రీం హెల్త్ పాలసీలో అనేక రీఫిల్ ఫీచర్లను అందించింది.ఈ ఫీచర్ వినియోగదారునికి గొప్ప ఉపశమనంగా పేర్కొంది. ఈ పాలసీ ప్రధానంగా రిటైల్ కస్టమర్లకు బహుళ ప్రయోజనాలు, కవరేజీలను అందిస్తుందని తెలిపింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI General Insurance: "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0