Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Tent weightage in inter results

ఇంటర్ ఫలితాలలో టెన్త్ వెయిటేజీ

Tent weightage in inter results

  • సెకండియర్ పై అవగాహనకు వచ్చిన కమిటీ
  • గతేడాది టెన్త్ ఆల్ పాస్ కావడంతో ఫస్టియర్పై మల్లగుల్లాలు
  • నెలాఖరులోగా ప్రకటించేందుకు కసరత్తు

 రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఇంటర్ ద్వితీయ సంవత్సరం విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఇంటర్ విద్యార్థులు గతేడాది ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయడంతోపాటు, అంతకుముందు సంవత్సరం పదో తరగతి ఫలితాలు ఉన్నాయి. దీంతో పదో తరగతి మార్కులకు 30శాతం, జూనియర్ ఇంటర్ మార్కు లకు 70 శాతం వెయిటేజ్లో మార్కులు నిర్ణయించాలని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లుసమాచారం. ప్రభుత్వామోదం లభిస్తే ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు మొదట విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదే సమయంలో ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల నిర్ధారణపై మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయం లో లాక్డౌన్ విధించడంతో పదో తరగతి పరీక్షలు జరగ లేదు. ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు అనంతరం 'ఆల్ పాస్' చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో గతేడాది టెన్త్ విద్యార్థులకు మార్కులు లేకుండానే లాంగ్ మెమోలు జారీ అయ్యాయి. అయితే అదే సమయంలో సీబీఎస్ఈ సిలబస్లో చదివిన విద్యార్థులకు మాత్రం పరీక్షలు జరిగి, మార్కులతో ఫలితాలు విడుద అయ్యాయి.

మార్కుల ప్రకటన ఎలా ?

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్కులు కేటాయించే అంశంపై హైపవర్ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది పది, ఇంటర్ రెండు సంవ త్సరాల పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. అయితే కర్ప్యూ ప్రకటించే సమయానికే ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఈ నేపథ్యం లో ప్రాక్టికల్ మార్కులకు కొంత మేర వెయిటేజ్ ప్రకటిం చాలనే ఆలోచనలో హైపవర్ కమిటీ ఉంది. ఫస్టియర్ విద్యా ర్థులు గతేడాది పదో తరగతిలో ఆల్ పాస్ కావడంతో.. వారి మార్కులు ప్రకటించలేదు. దీంతో కేవలం ఇంటర్నల్ మార్కులనే ప్రామాణికంగా తీసుకుని, వాటికి ప్రాక్టికల్స్ ఫ లితాలను కొంత వెయిటేజ్ కలిపితే విద్యార్ధులు నష్టపోకుండా ఉంటారనే అభిప్రాయాలను కమిటీ సభ్యులు వ్యక్తపరిచినట్లు తెలిసింది. అదే సమయంలో సీబీఎస్ఈలో చదివిన విద్యార్థులకు మార్కులు ప్రకటించి ఉండటంతో.. ఆ విద్యార్థులకు ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్లో మార్కుల కేటాయింపు ఎలా అనే సందేహాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పది పరీక్షలు రాసిన వారికి, రాయకుండా పాస్ అయిన వారికీ.. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో ఒకే ప్రాతిపదికనమార్కులు కేటాయిస్తే.. సీబీఎస్ఈ విద్యార్థులు అన్యా యానికి గురవుతారనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఈ సందేహాలను కొందరు సీబీఎస్ఈ విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు హైపవర్ కమిటీ దృష్టికి తీసు కెళ్లారు. విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయాలు, సూచ నలు పరిశీలించిన మీదటే ఒక నిర్ణయం తీసుకుని నివేదిక రూపొందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈఏపీ సెట్ ఫలితాలకు ఇబ్బంది లేకుండా...

రాష్ట్రంలో ఇంజినీరింగ్, మెడికల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్ష ఎంసెట్ పేరు మార్చి ఈఏపీ సెట్గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ర్యాంకింగ్ ఇంటర్ మార్కులకు ఇప్పటి వరకు 30 శాతం వెయిటేజ్ ఇస్తున్నారు.

ఈ ఏడాది పరీక్షలు జరగ కుండా అసెస్మెంట్ ద్వారా మార్కులు ప్రకటిం చనుండ టంతో వెయిటేజ్ ఏ విధంగా ఉంటుందనే సందే హాలు ఉన్నాయి. అలాగే ఇంటర్ పాస్తో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు సంబంధించి పలు ఉద్యోగాల నియామకాలు జరు గుతుంటాయి. ఇంటర్ మార్కులను ఇంటర్నల్స్, వెయి టేజ్ ఆధారంగా ప్రకటిస్తే.. ఆయా ఉద్యోగాల పరీక్షల్లో అన్యా యం జరుగుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పది, ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్లు ఇటీవల విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం.. ఏ ప్రకటిస్తుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Tent weightage in inter results"

Post a Comment