Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Corona test at home with ‘covihome’

‘కొవిహోమ్‌’తో ఇంట్లోనే కరోనా టెస్ట్‌

Corona test at home with ‘covihome’

  • దేశపు తొలి ర్యాపిడ్‌ ఎలకా్ట్రనిక్‌ ఆర్‌ఎన్‌ఏ టెస్ట్‌ కిట్‌
  • ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ శివగోవిందం ఘనత

కొవిహోమ్‌.. భారతదేశపు తొలి ర్యాపిడ్‌ ఎలకా్ట్రనిక్‌ కొవిడ్‌-19 ఆర్‌ఎన్‌ఏ టెస్ట్‌ కిట్‌. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీ హైదరాబాద్‌ ఎలకా్ట్రనిక్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ శివగోవిందం దీన్ని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌కు ఈ పరికరాన్ని అనుసంధానం చేసి నిపుణుల పర్యవేక్షణ లేకుండా ప్రజలు ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవచ్చు. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో 30నిమిషాల్లోనే ఫలితం తెలిపే ఈ పరికరం ఖరీదు కేవలం రూ.400. పెద్దఎత్తున ఉత్పత్తి చేస్తే రూ.300కే అందుబాటులోకి వస్తుందని అంచనా. కరోనాకు సంబంధించినంత వరకూ ఆర్టీ-పీసీఆర్‌ను ప్రామాణిక పరీక్షగా చెబుతారు. ఈ టెస్ట్‌కిట్‌ దాంతో సమాన ఫలితాలను ఇస్తోందని ఐఐటీహెచ్‌ అధికారులు తెలిపారు.

అయితే.. ఐసీఎంఆర్‌ సూచనల మేరకు సీఎ్‌సఐఆర్‌-సీసీఎంబీ ఈ టెస్ట్‌ కిట్‌ సామర్థ్యాన్ని పరిశీలించి.. దీని ప్రభావశీలత 94.2 శాతం, సెన్సిటివిటీ 91.3 శాతం, స్పెసిఫిసిటీ 98.2 శాతంగా తేల్చింది. కాగా.. కరోనా సమయంలో సాంకేతిక కార్యక్రమాల ద్వారా ఐఐటీహెచ్‌ ప్రజలకు చేదోడువాదోడుగా ఉందని ఆ సంస్థ డైరెక్టర్‌ బీఎ్‌స.మూర్తి అన్నారు. ప్రొఫెసర్‌ శివ గోవిందం తయారుచేసిన ‘కొవిహోమ్‌’ అద్భుతమైన ఫలితాలనిస్తోందని ఆయన వెల్లడించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Corona test at home with ‘covihome’"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0