Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DoT: Radiation from cell towers does not cause harm.

DoT: సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ హాని కలిగించదు వివరణ.

DoT: Radiation from cell towers does not cause harm.

దిల్లీ: సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పదం రేడియేషన్‌. ముఖ్యంగా సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ప్రాణానికే ప్రమాదమని ఈ మధ్య కాలంలో చాలా కథనాలే వచ్చాయి. అయితే ఆ రేడియేషన్‌ వల్ల ఎలాంటి హానీ జరగదని తాజా పరిశోధనల్లో తేలింది. సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ హాని కలిగిస్తుందని భావిస్తున్న తరుణంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యునికేషన్‌ సీనియర్‌ డిప్యుటీ డైరెక్టర్‌ హర్వేష్‌ భాటియా చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ‘‘విద్యుదయస్కాంతక్షేత్ర సంకేతాలపై జరిపిన విస్తృత పరిశోధనల్లో మొబైల్‌ టవర్‌ నుంచి వచ్చే రేడియేషన్‌ ఎటువంటి హానికరమైన ఆరోగ్య సమస్యలను కలిగించదని తేలింది’’ అని భాటియా వెల్లడించారు. మొబైల్‌ ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ గురించి వస్తోన్న అపోహలను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వ టెలికమ్యునికేషన్‌ విభాగం నిర్వహించిన వెబినార్లో భాటియా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వెబినార్లో పాల్గొన్న వైద్యనిపుణులు భాటియా చేసిన వ్యాఖ్యలను అమోదించారు. మొబైల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల ఎలాంటి హాని లేకపోవడంతో.. అంతరాయం లేకుండా సిగ్నళ్లను అందించడానికి మరికొన్ని టవర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్న విషయాన్ని భాటియా పునరుద్ఘాటించారు. కాగా ఈ వెబినార్‌కు డీవోటీ అధికారులతో పాటు, వైద్యులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కొన్ని సాంకేతిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DoT: Radiation from cell towers does not cause harm."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0