Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ready for alternative teaching

ప్రత్యామ్నాయ బోధనకు సమాయత్తం

Ready for alternative teaching

పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ బోధనకు విద్యాశాఖ సమాయత్తం అవుతోంది. ఈ నెల 15 నుంచి దూరదర్శన్‌, రేడియోల ద్వారా బోధించనున్నారు. అభ్యసన పరిశీలనకు ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన సాధన పత్రాలను డీసీఈబీలద్వారా  విద్యార్థులకు అందజేయనున్నారు. ఈ నెల 6న పాఠశాలల్లో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు.

విద్యార్థుల వివరాల సేకరణ

2020-21 విద్యాసంవత్సరంలో ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 తరగతులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే పాఠశాలల మ్యాపింగ్‌ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది.

బృందాల ఏర్పాటు

గ్రామ సచివాలయాల పరిధిలోని విద్యార్థులతో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థి బృందాలను ఏర్పాటు చేయనున్నారు. వీరు అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాల వివరాలు సేకరిస్తారు. సప్తగిరి ఛానల్‌, రేడియోల్లో ప్రసారమయ్యే పాఠాలకు అనుగుణంగా తర్వాత తేదీల్లో విద్యార్థులకు వర్క్‌షీట్ల(సాధన పత్రాలు)ను అందిస్తారు. వీటితో పాటు ఉపాధ్యాయులు కూడా వర్క్‌షీట్లు రూపొందించవచ్ఛు వారం రోజుల తర్వాత ఫలితాలను తమ గ్రూపుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తారు.

డిజిటల్‌ పాఠ్యాంశాల వినియోగం

అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమాల ద్వారా డిజిటల్‌ పాఠ్యాంశాలు సేకరించి విద్యార్థులకు చేరవేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీడియోల రూపకల్పనకు ఔత్సాహిక ఉపాధ్యాయులకు అవకాశం కల్పించారు. ఆ వీడియోలు స్థానిక కేబుల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా ప్రసారమయ్యేలా సహకరించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.

అందరూ భాగస్వాములే

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఈ నెల 6న విస్తృతంగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో జరిగే సమావేశాల్లో అందరూ భాగస్వాములే. సీఆర్పీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తల్లిదండ్రుల కమిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళికపై చర్చించాల్సి ఉంది.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ready for alternative teaching"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0