Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employee expectations for salaries and pensions

నిధుల కొరత సర్దుబాట్ల మోత!

Employee expectations for salaries and pensions

జీతాలు, పింఛన్లకు ఉద్యోగుల ఎదురుచూపులు

రెండో తారీకు దాటినా జమకాని వారెందరో


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు చాలామంది జీతాలు, పింఛన్ల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఈ నెల రెండో తారీకు దాటినా చాలామంది ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. ఉద్యోగులకు సగం మందికి అందినా, పింఛనుదారుల్లో వేల మందికి ఎదురు చూపులు తప్పడంలేదు. చాలినన్ని నిధులు అందుబాటులో లేకపోవడంతో అన్నింటికీ సర్దుబాట్లు తప్పడంలేదు. ఫలితంగా చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో జీతాలు, పింఛన్ల కోసం ప్రతినెలా రూ.5,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉన్న నిధుల మేరకు గురువారం కొందరికి, శుక్రవారం మరికొందరికి జీతాలు జమ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు అందాయి. జిల్లాలు, వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చాలామంది తమకు ఇంకా రాలేదని పేర్కొంటున్నారు. ముందుగా బిల్లులు సమర్పించిన కొద్దిమందికి జీతాలు జమ చేసినా అనేక జిల్లాల్లో ఇంకా పెండింగులో ఉన్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ పింఛన్లు జమ కాలేదని, ఈమేరకు తనకు ఫోన్లు వస్తున్నాయని పింఛనుదారుల చర్చావేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. తమకే జమ కాలేదా, అందరికీ రాలేదా అన్న విషయంలో స్పష్టత లేక పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. శనివారమైనా అందుతాయా అన్నది అనుమానమే. ఒకవైపు ఇప్పటికే వేస్‌ అండ్‌ మీన్స్‌ పరిమితి దాటిపోయినట్లు తెలిసింది. తిరిగి చెల్లింపులకు ఓవర్‌ డ్రాప్టుకు మధ్య గడువును అంచనా వేస్తూ కొంత మొత్తం సర్దుబాటు చేశారని, ఆ మేరకు మాత్రమే చెల్లింపులు జరిగాయని చెబుతున్నారు. రోజుకు ఖజానాకు పన్నులు, ఇతర వసూళ్ల రూపంలో వచ్చే మొత్తాలు తక్కువే. ఈ నేపథ్యంలో మొత్తం అందరికీ జీతాలు, పింఛన్లు అందేందుకు మరికొంత సమయం పడుతుందని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజర్వుబ్యాంకు నిర్వహించే సెక్యూరిటీ వేలం మంగళవారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ రూ.2,000 కోట్ల రుణం సమీకరించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సమర్పించింది. 16, 17 ఏళ్లల్లో తిరిగి చెల్లించేలా ఈ రుణ మొత్తం తీసుకుంటోంది. ఆ నిధులు బుధవారానికి సర్దుబాటు అవుతాయి. ఈలోపు ఓవర్‌ డ్రాప్టు సౌకర్యాన్ని వినియోగించుకుంటూ కొద్దికొద్దిగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేస్తారని సమాచారం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employee expectations for salaries and pensions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0