Google Pay: Do you know how much you can transfer daily from Google Pay?
Google Pay : గూగుల్ పే నుంచి రోజూ ఎంత Transfer చేయొచ్చో తెలుసుకుందాం.
ఇటీవలి కాలంలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా చేసే ట్రాన్సాక్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా Google Pay, ఫోన్ పే, పేటీఎం లాంటి పేమెంట్ యాప్స్‌ను ఎంతో మంది వాడుతున్నారు. ఎక్కువ శాతం యాప్స్ నుంచే పేమెంట్ చేస్తున్నారు. ఏదైనా వస్తువు కొన్నా , షాపింగ్ చేసినా ఎవరికైనా వెంటనే డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఈ యాప్స్ నుంచి యూపీఐ ద్వారా పంపుతున్నారు. బ్యాంకు నుంచి బ్యాంకుకు యూపీఐ ద్వారా డబ్బు పంపితే వెంటనే క్రెడిట్ అయ్యే సదుపాయం ఉండడంతో మనీ ట్రాన్స్ఫర్లకు ఈ మధ్య ఎక్కువగా యూపీఐ విధానాన్నే వాడుతున్నారు. అయితే యూపీఐ పేమెంట్స్‌కు లిమిట్ అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పేమెంట్ యాప్ Google Pay కు లిమిట్ ఎంత, నిబంధనలు ఏంటంటే..
Google Pay నే కాకుండా ఇతర యాప్స్ ద్వారా కూడా ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మొత్తం రోజుకు రూ.లక్ష వరకే డబ్బు పంపించే అవకాశం ఉంటుందని సంస్థ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. అంతకు మించి పంపేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ సక్సెక్ కాదని వెల్లడించింది. అలాగే అన్ని యూపీఐ యాప్స్‌లో రోజుకు 10సార్లే డబ్బు సెండ్ చేసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ యూపీఐ లిమిట్‌కు వివిధ బ్యాంకుల్లో.. వివిధ పరిమితులు ఉంటాయి. కొన్ని బ్యాంకుల ఖాతాలకు రూ.లక్ష పరిమితి ఉంటే మరికొన్నింటికి తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులు రోజుకు రూ.లక్ష వరకు యూపీఐ చెల్లింపులు చేసుకునే సదుపాయం ఉండగా.. అదే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అకౌంట్‌కు రోజుకు రూ.10వేల పరిమితి ఉంది. దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు రూ.లక్ష వరకు యూపీఐ పరిమితిని కల్పిస్తుండగా.. మరికొన్ని బ్యాంకులు రూ.50వేలు, రూ.25వేలు, రూ.10వేల గరిష్ఠ యూపీఐ లిమిట్‌ను విధించాయి. యూపీఐ పరిమితి విషయంపై బ్యాంకును సంప్రదించి.. లిమిట్‌ను కనుక్కుంటే ట్రాన్సాక్షన్స్ చేసుకునేందుకు ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేసుకోవచ్చు.ఒకవేళ లిమిట్ పూర్తిగా వాడకపోయినా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే తమ సపోర్ట్‌ను సంప్రదించాలని Google Pay సూచించింది. ఇలా ఫెయిల్ అవుతున్నప్పుడు వేరే బ్యాంకు ఖాతా లింక్ అయి ఉంటే దాని నుంచి డబ్బు పంపి ప్రయత్నించాలని చెప్పింది. ఒక్కోసారి బ్యాంకు సర్వర్లలో సమస్య ఉన్నప్పుడు కూడా ట్రాన్సాక్షన్స్ ఆలస్యమవుతాయని చెప్పింది. మోసాల నుంచి కస్టమర్లను కాపాడేందుకు ఒక్కోసారి అనుమానాస్పద ట్రాన్సాక్షన్లను రివ్యూ చేస్తామని Google Pay వెల్లడించింది. అలాగే ఒక్క రూపాయి కంటే తక్కువ మొత్తం పంపాలని ప్రయత్నించిన సమయంలోనూ ట్రాన్సాక్షన్ విజయవంతం కాదని పేర్కొంది.
0 Response to "Google Pay: Do you know how much you can transfer daily from Google Pay?"
Post a Comment