Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

LIC Policy: Save Rs.29 per day and own Rs.4,00,000 ... for women only.

 LIC Policy : రోజూ రూ .29 పొదుపు చేసి రూ .4,00,000 సొంతం చేసుకోండి ... మహిళలకు మాత్రమే.

LIC Policy: Save Rs.29 per day and own Rs.4,00,000 ... for women only.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC అన్ని వర్గాల కోసం ప్రత్యేక పాలసీలను అందిస్తుంది. అందులో మహిళలకు కూడా పాలసీలు ఉన్నాయి. ఓ పాలసీలో రోజూ రూ.29 చొప్పున పొదుపు చేస్తే చాలు. రూ.4,00,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఆ పాలసీ పేరు 'ఆధార్ శిల'. తక్కువ ప్రీమియంతో ఎల్ఐసీ అందిస్తున్న పాలసీల్లోల ఇదీ ఒకటి. ఇది కేవలం మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా అందిస్తున్న పాలసీ. ఈ పాలసీలో నెలకు రూ.29 చొప్పున 20 ఏళ్ల పాటు పొదుపు చేస్తే చాలు. 20 ఏళ్లల్లో చెల్లించిన మొత్తం రూ.2,14,696 అవుతుంది. ఈ పెట్టుబడికి మెచ్యూరిటీ తర్వాత రూ.4,00,000 రిటర్న్స్ వస్తాయి.

ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి.
ఈ రోజుల్లో ఆధార కార్డ్ దాదాపు అందరికీ ఉంటుంది కాబట్టి మహిళలు సులువుగా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఆరోగ్య పరీక్షలు అవసరం లేకుండా ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీహోల్డర్ ఐదేళ్ల లోపు మరణిస్తే సమ్ అష్యూర్డ్‌కు 110 శాతం, ఐదేళ్ల తర్వాత మరణిస్తే సమ్ అష్యూర్డ్‌+లాయల్టీ అడిషన్ లభిస్తాయి. పాలసీతో పాటు క్రిటికల్ ఇల్‌నెస్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎల్ఐసీ యాక్సిడెంటల్ రైడర్, పర్మనెంట్ డిసేబిలిటీ రైడర్ అదనంగా తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న మొదటి రోజు నుంచే రిస్క్ కవర్ ఉంటుంది.
LIC ఆధార్ శిల పాలసీ
ఎల్ఐసీ ఆధార్ శిల పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 8 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 55 ఏళ్లు. కనీసం 10 ఏళ్లకు పాలసీ తీసుకోవాలి. గరిష్టంగా 20 ఏళ్లకు పాలసీ తీసుకోవచ్చు. ఇక సమ్ అష్యూర్డ్ వివరాలు చూస్తే కనీసం రూ.75,000 సమ్ అష్యూర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.3,00,000 సమ్ అష్యూర్డ్ తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియం చెల్లించే ఆప్షన్స్ నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకు, ఏడాదికి ఉంటుంది.

ఇక ఈ పాలసీకి సంబంధించిన ఉదాహరణను బ్రోచర్‌లో వెల్లడించింది ఎల్ఐసీ. 35 ఏళ్ల వయస్సు ఉన్న ఓ మహిళ రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌తో 20 ఏళ్లకు ఆధార్ శిల పాలసీ తీసుకున్నట్టైతే ఏడాదికి ప్రీమియం రూ.3,709 + ట్యాక్సులు చెల్లించాలి. 20 ఏళ్లలో చెల్లించే మొత్తం రూ.74,180. మెచ్యూరిటీ తర్వాత రూ.1,00,000 సమ్ అష్యూర్డ్‌ లభిస్తుంది. దీంతో పాటు రూ.16,500 లాయల్టీ అడిషన్ కూడా లభిస్తుంది. అంటే మొత్తం రూ.74,180. చెల్లిస్తే రూ.1,16,500 తిరిగి పొందొచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "LIC Policy: Save Rs.29 per day and own Rs.4,00,000 ... for women only."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0