Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NABARD-recruitment-2021-jobs-162-notification-online-application

NABARD Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే.

NABARD-recruitment-2021-jobs-162-notification-online-application


నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ నాబార్డ్ (NABARD) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ - నాబార్డ్ (NABARD) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల.

మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సంస్థ. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తులకు ఆఖరి తేదీగా ఆగస్టు 07ను నిర్ణయించారు.

మొత్తం  ఖాళీలు : 162

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ nabard.org లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించనున్నారు. అందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా , రెండవది మెయిన్స్, చివరిగా ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 148
  • అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(రాజ్ భాష సర్వీస్): 5
  • అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): 2
  • మేనేజర్ ఇన్ గ్రేడ్ బీ(రూరల్ డవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 7

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు 55 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.

లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

మేనేజర్ గ్రేడ్ బి: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి బ్యాచలర్ డిగ్రీ ని 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ/PWD అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

లేదా 55 శాతం మార్కులు(ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో పీజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

NABARD ONLINE APPLICATION & NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NABARD-recruitment-2021-jobs-162-notification-online-application"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0