Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SBI Jobs Recruitment 2021

 SBI Jobs Recruitment 2021: ఎస్‌బీఐలో 6100 ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు .

SBI Jobs Recruitment 2021


SBI Apprentice Recruitment 2021  SBI 6100 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల వివరాలు .

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం 6100 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. అప్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ఏ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఆ రాష్ట్రంలో మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇవి అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. బ్యాంకులో ఉద్యోగం కాదు. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్‌బీఐ వెబ్‌సైట్స్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలో దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు తెలుగు లేదా ఉర్దూ తెలిసి ఉండాలి.

SBI Apprentice Recruitment 2021: ఖాళీల వివరాలు.

మొత్తం ఖాళీలు- 6100

తెలంగాణ- 125

  • ఆదిలాబాద్ -3
  • భద్రాద్రి కొత్తగూడెం -6
  • జగిత్యాల్ -2
  • జనగాం -3
  • జయశంకర్ భూపాలపల్లి-3
  • జోగులంబ గద్వాల -2
  • కామారెడ్డి -4
  • కరీంనగర్ -4
  • ఖమ్మం -7
  • కొమరంభీమ్ -2
  • మహాబూబాబాద్ -3
  • మహబూబ్‌నగర్ -9
  • మల్కాజ్‌గిరి -2
  • మంచిర్యాల్ -2
  • మెదక్ -4
  • నాగర్‌కర్నూల్ -4
  • నల్గొండ -6
  • నిర్మల్ -3
  • నిజామాబాద్ -11
  • పెద్దపల్లి -3
  • రంగారెడ్డి -6
  • సంగారెడ్డి -5
  • సిద్దిపేట -5
  • సిరిసిల్లా -2
  • సూర్యాపేట -7
  • వికారాబాద్ -6
  • వనపర్తి -3
  • వరంగల్ -1
  • వరంగల్ రూరల్ -3
  • యాదాద్రి భువనగిరి-4

ఆంధ్రప్రదేశ్- 100

  • శ్రీకాకుళం -8
  • విజయనగరం -8
  • విశాఖపట్నం -7
  • తూర్పు గోదావరి -8
  • పశ్చిమ గోదావరి -8
  • కృష్ణా -7
  • గుంటూరు -7
  • ప్రకాశం -8
  • నెల్లూరు -8
  • చిత్తూరు -8
  • వైఎస్ఆర్ కడప -8
  • అనంతపూర్ -8
  • కర్నూలు -7

SBI Apprentice Recruitment 2021: దరఖాస్తు చేయాల్సిన వెబ్‌సైట్స్

https://bank.sbi/careers

https://www.sbi.co.in/ careers

https://nsdcindia.org/apprenticeship

https://apprenticeshipindia.org

http://bfsissc.com

SBI Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

దరఖాస్తు ప్రారంభం- 06.07.21

దరఖాస్తుకు చివరి తేదీ- 26.07.21

ఆన్‌లైన్ ఎగ్జామినేషన్- 2021 ఆగస్ట్

SBI Apprentice Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 2020 ఆగస్ట్ 31 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల లోపు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీతో పాటు స్థానిక భాషల్లో ఉంటాయి. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

శిక్షణా కాలం- ఒక ఏడాది

స్టైపెండ్- నెలకు రూ.15,000. ఇతర బెనిఫిట్స్, అలవెన్సులు ఉండవు.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లోని చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

WEBSITE https://sbi.co.in/hi/web/careers#lattest

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SBI Jobs Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0