Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Kovid Protocol Compulsory in Schools

స్కూళ్లలో కోవిడ్ ప్రోటోకాల్ కంపల్సరీ

Kovid Protocol Compulsory in Schools

  • ఇకపై పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి
  • ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
  • రాత్రి 11 గంటల వరకు కర్న్యూ సడలింపు
  • కోవిడ్ నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష

 రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుండి పాఠశాలలను తెరిచినందున ఆయా పాఠశాలల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ సమర్థవంతంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ, ప్రతి పాఠశాలలోనూ వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటించేలా అధికారులు దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటి చర్యలు విధిగా తీసు కోవాలన్నారు. అదేవిధంగా పాఠశాలల్లో టెస్టింగ్కు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకవేళ ఎవరికైనా లక్షణాలు. కనిపిస్తే వెంటనే పరీక్షలు చేసేలా ఏర్పాట్లు ఉం డాలన్నారు. థర్డ్వేవ్ నేపథ్యంలో ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలను దృష్టిలో ఉంచుకుని సకల చర్య లు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా వ్యాక్సినేషన్లో గ్రామ, వార్డు సచివాలయాన్ని ఒక యూనిట్గా తీసుకోవాలని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ వెళ్లాలని ఆదేశించారు. ఉదయం 6 గంటలనుంచి రాత్రి 11 గంటలవరకూ కర్ప్యూ సడ లింపులు ఇస్తున్నట్లు తెలిపారు. తెల్లవారు జామున పెళ్లిళ్లు ఉంటే... ముం దస్తుగా అనుమతి తీసుకోవాలని, పెళ్లిళ్ల లో 150 మందికే అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ కార్యాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించేలా అధికారులు స్వయంగా పర్యవేక్షించాలని, ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Kovid Protocol Compulsory in Schools"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0