Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

A further delay in the payment of salaries!

జీతాల చెల్లింపులో మరికొంత జాప్యం!

A further delay in the payment of salaries!

 ప్రతి నెలా ఒకటో తేదీన రావాల్సిన జీతాలు ఆలస్య మవుతుండగా ఈ సారి పరిస్థితి మారలేదు. సోమ, మంగళ వారాల్లో కొందరి ఖాతాల్లోనే జీతాలు జమయ్యాయి. జీతాలు, పెన్షన్లు సమయానికి రావడం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ జీతాలు, పింఛన్లు అందేసరికి మరో వారం రోజులు పట్టవచ్చని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటు న్నాయి. చాలామందికి పింఛన్లు అందలేదని పెన్షనర్ల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర వీరయ్య తెలిపారు. ప్రతి నెలా జీతాలు, పింఛన్ల కోసం దాదాపు రూ.5,500 కోట్ల వరకు అవసరమవుతాయి. సోమవారం రూ. 2000 కోట్లలోపు చెల్లించామని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతుండగా... ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు మాత్రం రూ.3500 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్టు పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ చెల్లింపులు సాగిస్తున్నారు. రిజర్వు బ్యాంకులో మంగళవారం నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో రాష్ట్రం పాల్గొం ది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలానికి ఉంచి 7 శాతం వడ్డీతో రూ.2,000 కోట్ల రుణం తీసుకుంది. ఈ సొమ్ము బుధవారం సాయంత్రానికి జమయ్యే అవకాశముంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కోతను పరిగణనలోకి తీసుకుంటే ఇక మరో వెయ్యి కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్ నుంచి రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఈ నెలలోనే ఆ మొత్తమూ తీసుకోనుంది. ప్రస్తుతం వివిధ సామాజిక సంక్షేమ పథకాలకు ఈనెలలో చెల్లింపులు చేయాల్సి ఉంది. ఈమేరకు అధికారులు నిధుల సమీకరణ ప్రయత్నాల్లో ఉన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "A further delay in the payment of salaries!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0